Telugu Global
NEWS

శ్రీఖాచౌదరిని తప్పించే డీల్... రంగంలోకి నిర్మాత కేపీ చౌదరి

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసులో హంతకులను రక్షించేందుకు అప్పుడే పోలీసులపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న శ్రీఖాచౌదరిని తప్పించేందుకు పోలీసులపై పెద్దెత్తున ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇందుకు భారీగా డబ్బును ఆఫర్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. కొందరు రాజకీయ నాయకుల సాయంతో శ్రీఖాచౌదరిని రక్షించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లతో పాటు, మనీ ఆఫర్లు కూడా వస్తున్నాయి. శ్రీఖాచౌదరిని తప్పించేందుకు ఇప్పటికే భారీ డీల్‌ కుదిరినట్టు పలు మీడియా […]

శ్రీఖాచౌదరిని తప్పించే డీల్... రంగంలోకి నిర్మాత కేపీ చౌదరి
X

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసులో హంతకులను రక్షించేందుకు అప్పుడే పోలీసులపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న శ్రీఖాచౌదరిని తప్పించేందుకు పోలీసులపై పెద్దెత్తున ఒత్తిళ్లు వస్తున్నాయి.

ఇందుకు భారీగా డబ్బును ఆఫర్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. కొందరు రాజకీయ నాయకుల సాయంతో శ్రీఖాచౌదరిని రక్షించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లతో పాటు, మనీ ఆఫర్లు కూడా వస్తున్నాయి.

శ్రీఖాచౌదరిని తప్పించేందుకు ఇప్పటికే భారీ డీల్‌ కుదిరినట్టు పలు మీడియా సంస్థల్లో వార్తలొస్తున్నాయి. నిర్మాత కేపీ చౌదరి నందిగామ పోలీస్ స్టేషన్‌కు రావడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. శ్రీఖాచౌదరి తరపున కేపీ చౌదరి రంగంలోకి దిగినట్టు అనుమానిస్తున్నారు. కోట్లాది రూపాయలు వెదజల్లి అయినా సరే జయరాంను హత్య చేసిన హంతకులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

First Published:  2 Feb 2019 9:44 PM GMT
Next Story