Telugu Global
Cinema & Entertainment

వైఎస్ఆర్ పాత్రకు మమ్ముట్టి ప్రాణప్రతిష్ట చేశారు

ఎన్టీఆర్ బయోపిక్ ప్రభావం ఇండస్ట్రీపై బాగానే పడినట్టుంది. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో తమ సినిమాల్ని బయోపిక్ అంటుంటే ఎవరూ ఒప్పుకోవడం లేదు. తాజాగా మహి వి రాఘవ్ కూడా అదే చెబుతున్నాడు. మొన్నటివరకు యాత్ర సినిమాను వైఎస్ఆర్ బయోపిక్ గా చూశారు ప్రేక్షకులు. దర్శకుడు కూడా ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ అయితే, వెంటనే యాత్ర యూనిట్ కూడా అప్రమత్తమైంది. తమ సినిమాను వైఎస్ఆర్ బయోపిక్ అనొద్దంటున్నాడు దర్శకుడు మహి వి రాఘవ్. […]

వైఎస్ఆర్ పాత్రకు మమ్ముట్టి ప్రాణప్రతిష్ట చేశారు
X

ఎన్టీఆర్ బయోపిక్ ప్రభావం ఇండస్ట్రీపై బాగానే పడినట్టుంది. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో తమ సినిమాల్ని బయోపిక్ అంటుంటే ఎవరూ ఒప్పుకోవడం లేదు.

తాజాగా మహి వి రాఘవ్ కూడా అదే చెబుతున్నాడు. మొన్నటివరకు యాత్ర సినిమాను వైఎస్ఆర్ బయోపిక్ గా చూశారు ప్రేక్షకులు. దర్శకుడు కూడా ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ అయితే, వెంటనే యాత్ర యూనిట్ కూడా అప్రమత్తమైంది.

తమ సినిమాను వైఎస్ఆర్ బయోపిక్ అనొద్దంటున్నాడు దర్శకుడు మహి వి రాఘవ్. వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో తను కొన్ని సన్నివేశాలు రాసుకున్నానని, ఆ సన్నివేశాలతోనే సినిమా నడుస్తుందని, ఇది పూర్తిగా వైఎస్ జీవితాన్ని ప్రతిబింబించదని అంటున్నాడు. మరీ ముఖ్యంగా యాత్ర సినిమాలో వైఎస్ కుటుంబ సభ్యులు (జగన్ కూడా) ఉండరని చెబుతున్నాడు డైరక్టర్.

యాత్ర సినిమాలో రాజకీయాలు కేవలం 20శాతం మాత్రమే ఉంటాయంటున్నాడు రాఘవ్. మిగతా 80శాతం కథ మొత్తం మనుషుల భావోద్వేగాల మీద ఆధారపడి నడుస్తుందని చెబుతున్నాడు. సినిమాలో వైఎస్ఆర్ పాత్రకు మమ్ముట్టి ప్రాణప్రతిష్ట చేశారని చెప్పుకొచ్చాడు.

First Published:  2 Feb 2019 3:51 AM GMT
Next Story