Telugu Global
NEWS

జయరామ్ హత్యలో కీలక మలుపు.... శ్రీఖాను వదిలేయాలని 3.5కోట్లకు డీల్

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హత్య వెనుక జయరాం మేనకోడలు శ్రీఖా చౌదరి, రాజేష్ అనే వ్యక్తి ప్రమేయం పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. శ్రీఖా చౌదరి పలు అంశాల్లో జయరాంకు సాయంగా, సన్నిహితంగా ఉంటోంది. శ్రీఖా చౌదరికి రాజేష్ స్నేహితుడు. శ్రీఖా చౌదరిని వదిలేయాలని, ఆమెను కలవొద్దని రాజేష్‌పై జయరాం ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. శ్రిఖా చౌదరిని వదిలేస్తే రూ.3.5 కోట్లు ఇస్తానని రాజేష్‌కు ఆఫర్ చేశాడు […]

జయరామ్ హత్యలో కీలక మలుపు.... శ్రీఖాను వదిలేయాలని 3.5కోట్లకు డీల్
X

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హత్య వెనుక జయరాం మేనకోడలు శ్రీఖా చౌదరి, రాజేష్ అనే వ్యక్తి ప్రమేయం పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. శ్రీఖా చౌదరి పలు అంశాల్లో జయరాంకు సాయంగా, సన్నిహితంగా ఉంటోంది.

శ్రీఖా చౌదరికి రాజేష్ స్నేహితుడు. శ్రీఖా చౌదరిని వదిలేయాలని, ఆమెను కలవొద్దని రాజేష్‌పై జయరాం ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. శ్రిఖా చౌదరిని వదిలేస్తే రూ.3.5 కోట్లు ఇస్తానని రాజేష్‌కు ఆఫర్ చేశాడు జయరాం. అయితే డీల్‌లో భాగంగా ఇస్తానని చెప్పిన రూ. 3.5 కోట్లను రాజేష్‌కు జయరాం ఇవ్వలేదు.

శ్రీఖాచౌదరి

డబ్బు ఇవ్వకపోడంతో శ్రీఖా చౌదరి, రాజేష్‌ తిరిగి ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో వాచ్‌మెన్‌ను బెదిరించి జయరాం ఇంట్లోకి శ్రీఖా చౌదరి వెళ్లింది. ఈ విషయాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యాయి. రాజేష్‌ సాయంతో శ్రీఖాచౌదరే జయరాంను హత్య చేయించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

జయరాంపై విషప్రయోగం జరిగినట్టు అనుమానిస్తున్నారు. జయరాం మృతదేహం రంగు మారిపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ రిపోర్టు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. కేసును ఛేదించేందుకు నందిగామ పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  2 Feb 2019 2:45 AM GMT
Next Story