గాంధీభవన్‌లో రణరంగం... విరిగిన కుర్చీలు
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో గొడవ జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన భట్టి విక్రమార్క సన్మాన కార్యక్రమం ఇందుకు వేదిక అయింది. మాజీ ఎంపీ వీహెచ్, అంబర్‌పేట కార్యకర్తల మధ్య ఈ గొడవ జరిగింది. పార్టీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ అనుచరులను వీహెచ్ బూతులు తిట్టారు. దీంతో వీహెచ్ పైకి కార్యకర్తలు దూసుకెళ్లారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో శ్రీకాంత్, వీహెచ్ వర్గీయులు బాహాబాహీకి దిగారు. కుర్చీలతో కొట్టుకున్నారు. శ్రీకాంత్‌కు మొన్నటి […]
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో గొడవ జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన భట్టి విక్రమార్క సన్మాన కార్యక్రమం ఇందుకు వేదిక అయింది. మాజీ ఎంపీ వీహెచ్, అంబర్‌పేట కార్యకర్తల మధ్య ఈ గొడవ జరిగింది.
పార్టీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ అనుచరులను వీహెచ్ బూతులు తిట్టారు. దీంతో వీహెచ్ పైకి కార్యకర్తలు దూసుకెళ్లారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో శ్రీకాంత్, వీహెచ్ వర్గీయులు బాహాబాహీకి దిగారు.
కుర్చీలతో కొట్టుకున్నారు. శ్రీకాంత్‌కు మొన్నటి ఎన్నికల్లో అంబర్‌పేట టికెట్ రాకుండా వీహెచ్ అడ్డుకున్నారని కార్యకర్తలు ఆరోపించారు.