Telugu Global
NEWS

భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన లాయర్... కుమ్మేసిన భార్య

హైదరాబాద్‌లో ఓ లాయర్‌ చిన్నిల్లు బయటపడింది. ప్రియురాలితో లాయర్‌ పెట్టిన రెండో కాపురాన్ని భార్య బద్ధలు కొట్టింది. నిఘా పెట్టి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టేసింది. బంధువులతో కలిసి భర్తను చితక్కొట్టింది. ఉప్పల్‌కు చెందిన కృష్ణమాచారి క్రిమినల్ లాయర్. ఆయన భార్య వింధ్యా రాజస్థాన్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసేది. ఆమె పంపించే సొమ్ముతో ఇక్కడ కృష్ణమాచారి విలాసంగా బతికేస్తున్నాడు. భార్య ఎలాగో ఇక్కడ లేకపోవడంతో మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఓల్డ్ రామాంతపూర్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని […]

భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన లాయర్... కుమ్మేసిన భార్య
X

హైదరాబాద్‌లో ఓ లాయర్‌ చిన్నిల్లు బయటపడింది. ప్రియురాలితో లాయర్‌ పెట్టిన రెండో కాపురాన్ని భార్య బద్ధలు కొట్టింది. నిఘా పెట్టి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టేసింది. బంధువులతో కలిసి భర్తను చితక్కొట్టింది.

ఉప్పల్‌కు చెందిన కృష్ణమాచారి క్రిమినల్ లాయర్. ఆయన భార్య వింధ్యా రాజస్థాన్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసేది. ఆమె పంపించే సొమ్ముతో ఇక్కడ కృష్ణమాచారి విలాసంగా బతికేస్తున్నాడు.

భార్య ఎలాగో ఇక్కడ లేకపోవడంతో మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఓల్డ్ రామాంతపూర్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. అయితే భర్తకు దూరంగా రాజస్థాన్‌లో ఉండలేక వింధ్యా స్వచ్చంద పదవీ విరమణ చేసి హైదరాబాద్‌ వచ్చేసింది.

అయితే భర్త తనను నిర్లక్ష్యం చేస్తుండడం, అతడి ప్రవర్తనలో తేడా ఉండడంతో నిఘా ఉంచింది. భర్త ఎక్కడికి వెళ్తున్నాడో పసిగట్టింది. బంధువుల సాయంతో వెళ్లి భర్తను, అతడి ప్రియురాలిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్తకు నాలుగు తగిలించింది.

వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కృష్ణమాచారి గురించి ఆరా తీయగా అతడు ఇది వరకే పలువురు ఆడవాళ్లను పెళ్లి పేరుతో మోసం చేసినట్టు తేలింది.

First Published:  2 Feb 2019 2:36 AM GMT
Next Story