Telugu Global
Cinema & Entertainment

"భారతీయుడు 2" షూటింగ్ ఆపేసిన శంకర్... కారణం అదేనట...

స్టార్ డైరెక్టర్ శంకర్ “రోబో 2.O” అయిపోగానే ఏ మాత్రం గ్యాప్ కూడా తీసుకోకుండా వెంటనే “ఇండియన్ 2” సినిమాని స్టార్ట్ చేసేశాడు. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన “భారతీయుడు” సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా కోసం పోలాచ్చి లో ఒక భారీ సెట్ ని నిర్మించారు. ఈ సెట్ లోనే […]

భారతీయుడు 2 షూటింగ్ ఆపేసిన శంకర్... కారణం అదేనట...
X

స్టార్ డైరెక్టర్ శంకర్ “రోబో 2.O” అయిపోగానే ఏ మాత్రం గ్యాప్ కూడా తీసుకోకుండా వెంటనే “ఇండియన్ 2” సినిమాని స్టార్ట్ చేసేశాడు. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన “భారతీయుడు” సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది.

కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా కోసం పోలాచ్చి లో ఒక భారీ సెట్ ని నిర్మించారు. ఈ సెట్ లోనే మొదటి షెడ్యూల్ షూటింగ్ ని స్టార్ట్ చేశాడు శంకర్.

షూటింగ్ స్టార్ట్ అయి రెండు మూడు రోజులు కాకముందే సినిమా షూటింగ్ ని ఆపేసాడు శంకర్. ప్రస్తుతం వేసిన సెట్ లో కొన్ని తప్పులు ఉన్నాయని, అందుకే తాను అనుకున్న సీన్స్ పర్ఫెక్ట్ గా రావట్లేదు అని శంకర్ అంటున్నాడట. అందుకే ప్రొడక్షన్ డిజైనర్ తో మళ్ళీ సెట్ మొత్తం రీ వర్క్ చేయాలని శంకర్ చెప్పాడట.

ఈ మేరకు ఆర్ట్ టీం మళ్ళీ సెట్ పై రీ వర్క్ చేస్తున్నారు. ఈ సెట్ వర్క్ ఫినిష్ అవ్వగానే షూటింగ్ స్టార్ట్ చేస్తాడట శంకర్. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.

First Published:  2 Feb 2019 6:00 AM GMT
Next Story