Telugu Global
Cinema & Entertainment

అఖిల్ ఖాతాలో మరో దర్శకుడు

సత్య పినిశెట్టి, బోయపాటి శ్రీను, శ్రీనువైట్ల.. మొన్నటివరకు అఖిల్ లిస్ట్ లో నలిగిన దర్శకులు వీళ్లు. ఇప్పుడీ లిస్ట్ లోకి తాజాగా మరో దర్శకుడు చేరిపోయాడు. అతడే క్రిష్. అవును.. క్రిష్ దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేస్తాడంటూ తాజాగా మరో పుకారు షికారు చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఎన్టీఆర్-మహానాయకుడు సినిమాతో బిజీగా ఉన్నాడు క్రిష్. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే అఖిల్ తో కథా చర్చలు ప్రారంభిస్తాడట. ఈ కాంబినేషన్ సెట్ అవ్వడానికి ప్రధాన […]

అఖిల్ ఖాతాలో మరో దర్శకుడు
X

సత్య పినిశెట్టి, బోయపాటి శ్రీను, శ్రీనువైట్ల.. మొన్నటివరకు అఖిల్ లిస్ట్ లో నలిగిన దర్శకులు వీళ్లు. ఇప్పుడీ లిస్ట్ లోకి తాజాగా మరో దర్శకుడు చేరిపోయాడు. అతడే క్రిష్. అవును.. క్రిష్ దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేస్తాడంటూ తాజాగా మరో పుకారు షికారు చేయడం మొదలుపెట్టింది.

ప్రస్తుతం ఎన్టీఆర్-మహానాయకుడు సినిమాతో బిజీగా ఉన్నాడు క్రిష్. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే అఖిల్ తో కథా చర్చలు ప్రారంభిస్తాడట. ఈ కాంబినేషన్ సెట్ అవ్వడానికి ప్రధాన కారణం నాగార్జున అని తెలుస్తోంది. తాజాగా విడుదలైన మిస్టర్ మజ్ను కూడా ఫ్లాప్ అవ్వడంతో, ఈసారి అఖిల్ కు హిట్ ఇచ్చే బాధ్యతను క్రిష్ పై పెట్టాడట నాగ్.

పైగా హీరోల్లోని నటనను వెలికితీస్తాడనే పేరుంది క్రిష్ కి. కాబట్టి సినిమా రిజల్ట్ తేడాకొట్టినప్పటికీ కనీసం అఖిల్ యాక్టింగ్ కైనా ప్రశంసలు వస్తాయనేది నాగ్ ప్లాన్. ప్రస్తుతానికైతే అఖిల్ తో సినిమా చేసేందుకు నిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదు. సో.. నాగార్జునే మరోసారి నిర్మాతగా మారే ఛాన్స్ ఉంది.

First Published:  2 Feb 2019 8:00 AM GMT
Next Story