Telugu Global
Cinema & Entertainment

అఖిల్ ఆ అలవాటును పూర్తిగా మానుకున్నాడట

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కి ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా పడలేదు. తొలి సినిమా “అఖిల్” డిసాస్టర్ కాగా, ఆ తరువాత విక్రం కే కుమార్ తో చేసిన “హలో” మాత్రం కాస్త పర్వాలేదు అనిపించింది. ఇక ఇటీవలే వెంకీ అట్లూరి దర్శకత్వంలో “మిస్టర్ మజ్ను” అంటూ వచ్చి హిట్ అందుకోలేకపోయాడు అఖిల్. ఇదిలా ఉంటే అఖిల్ కి కాలేజీ రోజుల్లో స్మోకింగ్ అలవాటు ఉండేదట. అయితే అఖిల్ ఆ […]

అఖిల్  ఆ అలవాటును పూర్తిగా మానుకున్నాడట
X

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కి ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా పడలేదు. తొలి సినిమా “అఖిల్” డిసాస్టర్ కాగా, ఆ తరువాత విక్రం కే కుమార్ తో చేసిన “హలో” మాత్రం కాస్త పర్వాలేదు అనిపించింది. ఇక ఇటీవలే వెంకీ అట్లూరి దర్శకత్వంలో “మిస్టర్ మజ్ను” అంటూ వచ్చి హిట్ అందుకోలేకపోయాడు అఖిల్.

ఇదిలా ఉంటే అఖిల్ కి కాలేజీ రోజుల్లో స్మోకింగ్ అలవాటు ఉండేదట. అయితే అఖిల్ ఆ స్మోకింగ్ అలవాటు ని మానేశాడట. అలాగే స్మోక్ చేసేవాళ్లు పూర్తిగా మానేయండి అది మంచి అలవాటు కాదంటూ కోరుతున్నాడు అఖిల్.

నాగార్జున తమ సినిమా కథల విషయంలో తల దూర్చడని, ఆయన మాకు ఒక మంచి ఫ్రెండ్ లాగ ఉంటాడని చెప్పాడు అఖిల్. ఇకపోతే ప్రస్తుతం అఖిల్ తన తదుపరి సినిమాని ఎవరి దర్శకత్వంలో చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.

First Published:  2 Feb 2019 1:10 AM GMT
Next Story