Telugu Global
Cinema & Entertainment

త్రివిక్రమ్ సినిమాల్లో నటించకపోవడానికి.... కారణం చెప్పిన హేమ

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎప్పటి నుంచో ఇండస్ట్రీ లో ఉన్న హేమ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. హీరోయిన్ అవుదాం అని ఇండస్ట్రీ కి వచ్చిన హేమ…. అప్పట్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసినా క్లిక్ అవ్వలేదు. ఇక చేసేది లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది. ఇక ఇప్పుడు ఈమె స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ పై సీరియస్ కామెంట్స్ చేసింది. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో […]

త్రివిక్రమ్ సినిమాల్లో నటించకపోవడానికి.... కారణం చెప్పిన హేమ
X

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎప్పటి నుంచో ఇండస్ట్రీ లో ఉన్న హేమ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. హీరోయిన్ అవుదాం అని ఇండస్ట్రీ కి వచ్చిన హేమ…. అప్పట్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసినా క్లిక్ అవ్వలేదు. ఇక చేసేది లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది.

ఇక ఇప్పుడు ఈమె స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ పై సీరియస్ కామెంట్స్ చేసింది. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో హేమని త్రివిక్రమ్ సినిమాల్లో మీరెందుకు కనిపించట్లేదు అని యాంకర్ అడగ్గా…. దానికి హేమ సమాధానమిస్తూ…. “అసలు త్రివిక్రమ్ ఎవరండి నా రెమ్యునరేషన్ డిసైడ్ చెయ్యడానికి? ఒక సినిమా విషయంలో నేను వెళ్ళి ప్రొడ్యూసర్ తో మాట్లాడకముందే…. త్రివిక్రమే నా రెమ్యునరేషన్ ని డిసైడ్ చేసి చెప్పేశాడు. అసలు ఒక డైరెక్టర్ కి ఆర్టిస్ట్ యొక్క రెమ్యునరేషన్ డిసైడ్ చేసే హక్కు లేదు. త్రివిక్రమ్ ఆ విషయంలో నాకు అస్సలు నచ్చలేదు” అంటూ త్రివిక్రమ్ పై గరం గరం అయ్యింది ఈ ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.

అయితే ఒకప్పుడు త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు అంటే అందులో హేమ పాత్ర తప్పకుండా ఉండేది, కానీ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాల్లో హేమ కనిపించట్లేదు.

First Published:  31 Jan 2019 11:58 PM GMT
Next Story