Telugu Global
Cinema & Entertainment

మహర్షి రిలీజ్ డేట్ ఫిక్స్

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మహర్షి సినిమాపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నట్టు స్వయంగా నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లు అందరికీ సమాచారం ఇచ్చినట్టు ప్రకటించాడు. అసలు మహర్షి సినిమా విడుదలను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. “అన్నీ అనుకున్నట్టు జరిగితే చెప్పిన తేదీకే మహర్షి సినిమా థియేటర్లలోకి రావాలి. కానీ మాకు అమెరికా వీసాల సమస్య ఏర్పడింది. నెల రోజులు ఆలస్యంగా వీసాలు […]

మహర్షి రిలీజ్ డేట్ ఫిక్స్
X

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మహర్షి సినిమాపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నట్టు స్వయంగా నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లు అందరికీ సమాచారం ఇచ్చినట్టు ప్రకటించాడు. అసలు మహర్షి సినిమా విడుదలను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు.

“అన్నీ అనుకున్నట్టు జరిగితే చెప్పిన తేదీకే మహర్షి సినిమా థియేటర్లలోకి రావాలి. కానీ మాకు అమెరికా వీసాల సమస్య ఏర్పడింది. నెల రోజులు ఆలస్యంగా వీసాలు వచ్చాయి. దాంతో షెడ్యూల్స్ అన్నీ మారిపోయాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అన్నీ పక్కాగా ప్లాన్ చేశాం. మార్చి నాటికి షూటింగ్ కంప్లీట్ చేస్తాం. ఏప్రిల్ 25న మహర్షి సినిమాను రిలీజ్ చేస్తాం”

ఇలా సినిమా విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటించాడు దిల్ రాజు. ఈ సినిమాకు పీవీపీ, అశ్వనీదత్ కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నప్పటికీ, మార్కెటింగ్ వ్యవహారాలన్నీ తనే చూసుకుంటున్నట్టు తెలిపాడు దిల్ రాజు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు.

First Published:  31 Jan 2019 9:53 PM GMT
Next Story