Telugu Global
Cinema & Entertainment

2021 సంక్రాంతికి "ఎఫ్ 2" సీక్వెల్ వస్తుందట

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా “ఎఫ్ 2”. దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే దాదాపు వంద కోట్ల దాకా వసూలు చేసిన ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తూనే ఉంది.  వెంకటేష్ కెరీర్ లోనే “ఎఫ్ 2” బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. […]

2021 సంక్రాంతికి ఎఫ్ 2 సీక్వెల్ వస్తుందట
X

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా “ఎఫ్ 2”. దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇప్పటికే దాదాపు వంద కోట్ల దాకా వసూలు చేసిన ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తూనే ఉంది. వెంకటేష్ కెరీర్ లోనే “ఎఫ్ 2” బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కి దిల్ రాజు కథని రెడీ చేయిస్తున్నాడట. ఇక ఈ సీక్వెల్ లో వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లతో పాటు ఇంకో హీరో కూడా ఉంటాడని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం తన ప్రొడక్షన్ హౌస్ లో వరుస సినిమాలు రెడీ అవుతున్నాయని, అవన్నీ ఓ కొలిక్కి వచ్చాక “ఎఫ్ 3” పనులు స్టార్ట్ చేసి, త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి 2021 సంక్రాంతి నాటికి ఈ సినిమాని రిలీజ్ చేస్తామని దిల్ రాజు ప్రకటించాడు. ఈ సినిమాని కూడా అనిల్ రావిపూడే డైరెక్ట్ చేస్తాడట.

First Published:  1 Feb 2019 6:37 AM GMT
Next Story