Telugu Global
NEWS

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.... ఈడీ నోటీసులు జారీ....

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ నేత వేం నరేందర్‌ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. ఉదయం నేరుగా వేం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఈ నోటీసులను ఈడీ అధికారులు అందజేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రేవంత్ రెడ్డితోపాటు వేం నరేందర్‌ రెడ్డి కూడా కీలక పాత్ర పోషించారు. […]

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.... ఈడీ నోటీసులు జారీ....
X

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ నేత వేం నరేందర్‌ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు.

ఉదయం నేరుగా వేం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఈ నోటీసులను ఈడీ అధికారులు అందజేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రేవంత్ రెడ్డితోపాటు వేం నరేందర్‌ రెడ్డి కూడా కీలక పాత్ర పోషించారు.

వేం నరేందర్ రెడ్డి

ఎమ్మెల్యేలను కొనేందుకు తెచ్చిన డబ్బులు వేం నరేందర్ రెడ్డి ఖాతా నుంచే వచ్చాయని ఈడీ గుర్తించింది. ఈనేపథ్యంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంలో భారీగా మనీలాండరింగ్‌ జరిగినట్టు ఈడీ కనిపెట్టింది.

ఈ డబ్బులు ఎక్కడి నుంచి, ఎలా వచ్చాయో వివరణ ఇవ్వాల్సిందిగా వేం నరేందర్ రెడ్డికి ఈడీ నోటీసుల్లో ఆదేశించింది. ఓటుకు నోటు వ్యవహారం సమయంలో రేవంత్ రెడ్డితో పాటు నరేందర్ రెడ్డి కూడా టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరిపోయారు.

First Published:  1 Feb 2019 5:28 AM GMT
Next Story