Telugu Global
Cinema & Entertainment

ఈ ప్రాజెక్ట్ అయినా "జోష్" నింపేనా?

అక్కినేని నాగ చైతన్య ఇండస్ట్రీ కి “జోష్” సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించాడు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫిస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. అయితే మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత దిల్ రాజు నాగ చైతన్య తో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ మేరకు దిల్ రాజు నాగ చైతన్య డేట్స్ కూడా తీసుకున్నాడని టాక్. శశి అనే కొత్త డైరెక్టర్ ఈ […]

ఈ ప్రాజెక్ట్ అయినా జోష్ నింపేనా?
X

అక్కినేని నాగ చైతన్య ఇండస్ట్రీ కి “జోష్” సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించాడు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫిస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.

అయితే మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత దిల్ రాజు నాగ చైతన్య తో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ మేరకు దిల్ రాజు నాగ చైతన్య డేట్స్ కూడా తీసుకున్నాడని టాక్. శశి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడట.

అయితే ఈ డైరెక్టర్ దిల్ రాజు బ్యానర్ లో వేరే హీరోతో సినియా చేయాల్సి ఉందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అందుకే ఇప్పుడు అదే డైరెక్టర్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా దిల్ రాజు సినిమాని ప్లాన్ చేశాడట.

ఈ విషయాన్ని దిల్ రాజు ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుతం నాగ చైతన్య “మజిలి” “వెంకీ మామ” సినిమాలతో బిజీగా ఉన్నాడు. దిల్ రాజు కూడా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ ఇద్దరూ ఫ్రీ కాగానే అధికారికంగా ఈ సినిమా పూర్తి వివరాలను తెలియజేస్తారట.

First Published:  1 Feb 2019 3:37 AM GMT
Next Story