Telugu Global
NEWS

చిగురుపాటి హత్య కేసులో శిఖా చౌదరిని ప్రశ్నించనున్న పోలీసులు

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తొలుత ఇది రోడ్డు ప్రమాదం అని భావించారు. కానీ ఘటన స్థలితో పాటు, టోల్ ప్లాజా వద్ద లభించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇది హత్యేనని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వస్తున్న సమయంలో ఐతవరం వద్ద దారుణం జరిగింది. కారులోనే హత్య చేశారా? లేక బయట చేసి కారులో పడేశారా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో […]

చిగురుపాటి హత్య కేసులో శిఖా చౌదరిని ప్రశ్నించనున్న పోలీసులు
X

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తొలుత ఇది రోడ్డు ప్రమాదం అని భావించారు. కానీ ఘటన స్థలితో పాటు, టోల్ ప్లాజా వద్ద లభించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇది హత్యేనని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వస్తున్న సమయంలో ఐతవరం వద్ద దారుణం జరిగింది. కారులోనే హత్య చేశారా? లేక బయట చేసి కారులో పడేశారా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో సీట్ల మధ్య మృతదేహం లభించడంతో ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

తలకు బలమైన గాయం ఉంది. కుటుంబసభ్యులను, కంపెనీ సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ వస్తున్నానని… తనకు హోటల్‌లో రూం రెడీ చేయాలని తన సిబ్బందిని జయరాం ఆదేశించారు. అలా వస్తున్న సమయంలో జయరాం మిస్టరీ డెత్‌కు గురయ్యారు. టోల్ ప్లాజా వద్ద లభించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా కారులో జయరాంతో పాటు మరికొందరు ప్రయాణించినట్టు గుర్తించారు. వారిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

జయరాం మేనకోడలు శిఖా చౌదరిని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రోడ్డుకు పక్కనే ఉన్న పంట పొలాలవైపు కారు దూసుకెళ్లి ఆగిపోవడంతో తొలుత రోడ్డు ప్రమాదం అని భావించారు. కానీ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించిన తర్వాత ఇది హత్యేనని నిర్ధారణకు వచ్చారు.

జయరాంతో పాటు కారులో ప్రయాణించిన వారిని పట్టుకుంటే మొత్తం కేసు కొలిక్కి వస్తుందని ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన వారు దీన్ని రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు చెబుతున్నారు. కానీ టోల్ ప్లాజా వద్ద సీసీ ఫుటేజ్ వల్ల కారులో మరికొందరు ఉన్నట్టు తేలింది. జయరాం హత్యకు హైదరాబాద్‌లోనే ప్లాన్‌ చేసి అతడితో పాటు కారులోనే ప్రయాణించినట్టు భావిస్తున్నారు. ఇది ముమ్మాటికి తెలిసిన వారు చేసిన పనేనని పోలీసులు చెబుతున్నారు.

First Published:  1 Feb 2019 10:08 AM GMT
Next Story