Telugu Global
NEWS

తొగాడియా వస్తే అరెస్ట్‌ చేయాలని ఆదేశించా....

న్యాయం చేస్తారని నరేంద్ర మోడీ చుట్టూ తిరిగానని చెప్పారు చంద్రబాబు. విమానాశ్రయాలకు వెళ్లి స్వాగతం పలికానని చెప్పారు. ఢిల్లీకి వెళ్లి ఏడు రోజులు దీక్ష చేస్తే కరన్ తాపర్ వచ్చి పొట్టి శ్రీరాములు ఎప్పుడవుతావ్ అని ప్రశ్నించాడని చెప్పారు. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందన్నారు. అన్నీ దిగమింగి ముందుకెళ్తున్నానని చెప్పారు. రాష్ట్ర విభజనతో పెద్దమ్మనే కాదు… చిన్నమ్మను కూడా గుర్తించుకోండి అని సుష్మా స్వరాజ్ చెప్పారని గుర్తు చేశారు. దేశం కోసమే పదేళ్ల పాటు గతంలో బీజేపీతో […]

తొగాడియా వస్తే అరెస్ట్‌ చేయాలని ఆదేశించా....
X

న్యాయం చేస్తారని నరేంద్ర మోడీ చుట్టూ తిరిగానని చెప్పారు చంద్రబాబు. విమానాశ్రయాలకు వెళ్లి స్వాగతం పలికానని చెప్పారు.

ఢిల్లీకి వెళ్లి ఏడు రోజులు దీక్ష చేస్తే కరన్ తాపర్ వచ్చి పొట్టి శ్రీరాములు ఎప్పుడవుతావ్ అని ప్రశ్నించాడని చెప్పారు.

రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందన్నారు. అన్నీ దిగమింగి ముందుకెళ్తున్నానని చెప్పారు. రాష్ట్ర విభజనతో పెద్దమ్మనే కాదు… చిన్నమ్మను కూడా గుర్తించుకోండి అని సుష్మా స్వరాజ్ చెప్పారని గుర్తు చేశారు. దేశం కోసమే పదేళ్ల పాటు గతంలో బీజేపీతో కలవలేదని చెప్పారు.

గోద్రా ఘటన తర్వాత పదేళ్లు బీజేపీకి దూరంగా ఉన్నానని చెప్పారు. బీజేపీతో కలిసినప్పుడు కూడా మతసామరస్యం కోసం పోరాడామని చెప్పారు. తొగాడియా అనంతపురం వస్తే అరెస్ట్ చేయాల్సిందిగా గతంలో ఆదేశించానని చెప్పారు. దాంతో ఆయన విమానం కూడా ఇక్కడికి రాలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

14 సీట్లు ఇస్తే నాలుగు సీట్లు మాత్రమే బీజేపీ ఎందుకు గెలిచిందని ప్రశ్నించారు చంద్రబాబు. కియో మోటర్స్‌ను తాను కష్టపడి తెచ్చానని… కానీ దాన్ని తెచ్చింది మోడీ అంటూ ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇస్తేనే ఏపీ నిలదొక్కుకుంటుందని… ఇదే బీజేపీ పెద్దలు వ్యాఖ్యానించారని చంద్రబాబు మండిపడ్డారు.

తనను ఇంతవాడిని చేసిన ఈ జన్మభూమి కోసమే తాను నల్లచొక్కా వేసుకుని అసెంబ్లీకి వచ్చానని చెప్పారు. మోడీ కంటే తానే సీనియర్‌ను అని చెప్పుకున్నారు. అన్ని కూటమిల్లో భాగస్వామిగా పనిచేసిన తాను, ఇంతటి గొప్ప వ్యక్తిని…. నల్లచొక్కా వేసుకుని వచ్చి నిరసన తెలుపుతున్నానంటే ఎంతగా మోసం చేశారో అర్థం చేసుకోవాలన్నారు.

ఉండవల్లి అరుణ్ కుమార్ అఖిలపక్ష భేటీ పెడితే…. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే అయినా సరే సమావేశానికి మంత్రులను పంపించామని అసెంబ్లీలో చంద్రబాబు చెప్పారు.

First Published:  1 Feb 2019 3:45 AM GMT
Next Story