Telugu Global
International

బ్రేకింగ్... యూఎస్ అధికారుల అదుపులో 200 మంది తెలుగువారు, వీరే వారు...

అమెరికాలోని తెలుగు కుటుంబాల్లో అలజడి రేగింది. యూఎస్‌ అధికారులు ఏర్పాటు చేసిన ఫేక్ వర్శిటీ ఉచ్చు కలకలం రేపుతోంది. అక్రమ వలసదారుల్ని గుర్తించేందుకు ఈ ఫేక్ వర్సిటీ టీంలను ఏర్పాటు చేశారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు మారువేషాల్లో వర్శిటీల్లో ఉద్యోగులుగా చేరి అక్రమ వలసదారుల వివరాలను సేకరించారు. ఇమ్మిగ్రేషన్‌ అక్రమాలు చేస్తున్న వారిని పట్టుకునేందుకు ఈ తరహా వల పన్నారు. ఈ ఆపరేషన్‌లో 200 మంది తెలుగు వారు చిక్కారు. 200 మందిని అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. […]

బ్రేకింగ్... యూఎస్ అధికారుల అదుపులో 200 మంది తెలుగువారు, వీరే వారు...
X

అమెరికాలోని తెలుగు కుటుంబాల్లో అలజడి రేగింది. యూఎస్‌ అధికారులు ఏర్పాటు చేసిన ఫేక్ వర్శిటీ ఉచ్చు కలకలం రేపుతోంది. అక్రమ వలసదారుల్ని గుర్తించేందుకు ఈ ఫేక్ వర్సిటీ టీంలను ఏర్పాటు చేశారు.

ఇమ్మిగ్రేషన్ అధికారులు మారువేషాల్లో వర్శిటీల్లో ఉద్యోగులుగా చేరి అక్రమ వలసదారుల వివరాలను సేకరించారు. ఇమ్మిగ్రేషన్‌ అక్రమాలు చేస్తున్న వారిని పట్టుకునేందుకు ఈ తరహా వల పన్నారు.

ఈ ఆపరేషన్‌లో 200 మంది తెలుగు వారు చిక్కారు. 200 మందిని అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి హెచ్‌1బీ వీసాకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులున్నారు.

నకిలీ మాస్టర్స్‌ డిగ్రీలతో ఉద్యోగాలు చేస్తున్న మరికొందరు పట్టుబడ్డారు. డెట్రాయిట్‌ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో 14 మంది తెలుగువారున్నారు. అరెస్ట్ అయిన వారిలో నవీన్ ప్రత్తిపాటి, సురేష్‌ కందాల, కర్నాటి ఫణదీప్, కాకి భరత్‌, ప్రేమ్‌, సంతోష్‌ శామా, అవినాష్ తక్కళ్లపల్లి, అశ్వంత్‌ నూనె తదితరులు ఉన్నారు.

First Published:  30 Jan 2019 11:04 PM GMT
Next Story