Telugu Global
NEWS

సైకిల్ ముందు.... కాపు నుయ్యి.... వెనుక బీసీ గొయ్యి....!

మరో మూడు నెలలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు కేంద్రంలో తమ అనుయాయులనే అధికారంలోకి రప్పించేందుకు తెలుగుదేశం పార్టీ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పథకాలు, తాయిలాలతో ఆకర్షిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఆర్దిక వెనుకబాటు కులాలకు 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తు తీర్మానించింది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా […]

సైకిల్ ముందు.... కాపు నుయ్యి.... వెనుక బీసీ గొయ్యి....!
X

మరో మూడు నెలలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు కేంద్రంలో తమ అనుయాయులనే అధికారంలోకి రప్పించేందుకు తెలుగుదేశం పార్టీ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పథకాలు, తాయిలాలతో ఆకర్షిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఆర్దిక వెనుకబాటు కులాలకు 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తు తీర్మానించింది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాలు, ఎత్తుగడలు, కుట్రలు, కుతంత్రాలు ఏనాటి నుంచో తెలిసి ఉన్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మాత్రం చంద్రబాబును నమ్మేది లేదని అంటున్నారు. ముద్రగడ అంటే కాపు సీనియర్ నాయకులకు, యువతకు మంచి గురి ఉంది. ఆయన మాటను ఆ కులస్థులు వేదవాక్కుగా భావిస్తారు. దీంతో ముద్రగడను ఒప్పించి తమ దారిలోకి తెచ్చుకోవడం చంద్రబాబు నాయుడికి కుదరడం లేదు.

మరోవైపు కాపు కులానికి చెందిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా జనసేన పార్టీతో ముందుకు వచ్చారు. గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ మాట మేరకు కాపులు చాలామంది తెలుగుదేశానికి మద్దతు పలికారు. ఈ సారి పవన్ కల్యాణే ప్రత్యక్షంగా రంగంలోకి దిగడంతో కాపు ఓట్లు తెలుగుదేశానికి పడేలా లేవు.

ఇక బీసీ కులాలను తమ వైపు తిప్పుకుందుకు గర్జన పేరుతో పెద్ద సభే నిర్వహించారు చంద్రబాబు నాయుడు. గడచిన నాలుగున్నర ఏళ్లుగా తమను పట్టించుకోని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు వరాల జల్లు కురిపించడం పై బీసీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పుట్టిందని చెబుతున్న చంద్రబాబు తమ రిజర్వేషన్ ఫలాలను కాపులకు కట్టబెట్టేందుకు గతంలో ప్రయత్నించారని వారు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల ముందు వరకూ తమ పట్ల, బీసీ కులాల నాయకుల పట్ల అత్యంత ప్రేమాభిమానాలు కురిపించే చంద్రబాబు అవసరం తీరక వదిలివేస్తారని, ఇందుకు సమైక్య రాష్ట్రంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని వారు అంటున్నారు. దీంతో గతాన్ని తవ్వుకోకుండ ఇంతకు ముందు బీసీలకు చేకూర్చిన ప్రయోజనాలను తెలియజేసేందుకు సైకిల్ ప్రయాణాన్ని అటువైపు మళ్లిద్దామంటే అక్కడ బీసీల నుయ్యి అడ్డంకిగా మారింది. కాపులతో ముందుకు వెళ్లలేక బీసీలకు కలిగించిన పూర్వవైభవం ఏమిలేక చంద్రబాబు నాయుడు ఆ ఇద్దరికి దూరం అవుతున్నాడు.

First Published:  31 Jan 2019 10:27 AM GMT
Next Story