Telugu Global
NEWS

చంద్రబాబు ముఖం చూసేందుకు కూడా విజయభాస్కర్‌ రెడ్డి ఇష్టపడేవారు కాదు...

మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమవడంపై సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ విఎం కృష్ణారావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక చర్చాకార్యక్రమంలో మాట్లాడిన ఆయన… గతంలో చంద్రబాబునాయుడి ముఖం చూసేందుకు కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇష్టపడేవారు కాదన్నారు. చంద్రబాబు ఎక్కే విమానాన్ని విజయభాస్కర్ రెడ్డి ఎక్కేవారు కాదన్నారు. చంద్రబాబు బుక్‌ చేసుకుంటే… సదరు విమానంలో వెళ్లేందుకు ఇష్టపడని విజయభాస్కర్ రెడ్డి విమాన టికెట్లను కూడా రద్దు చేసుకున్న […]

చంద్రబాబు ముఖం చూసేందుకు కూడా విజయభాస్కర్‌ రెడ్డి ఇష్టపడేవారు కాదు...
X

మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమవడంపై సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ విఎం కృష్ణారావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఒక చర్చాకార్యక్రమంలో మాట్లాడిన ఆయన… గతంలో చంద్రబాబునాయుడి ముఖం చూసేందుకు కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇష్టపడేవారు కాదన్నారు. చంద్రబాబు ఎక్కే విమానాన్ని విజయభాస్కర్ రెడ్డి ఎక్కేవారు కాదన్నారు.

చంద్రబాబు బుక్‌ చేసుకుంటే… సదరు విమానంలో వెళ్లేందుకు ఇష్టపడని విజయభాస్కర్ రెడ్డి విమాన టికెట్లను కూడా రద్దు చేసుకున్న ఉదంతాలు అనేకం తనకు తెలుసన్నారు. చర్చలో మరో జర్నలిస్ట్ కొమ్మినేని… గతంలో విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉండగా అసెంబ్లీ వేదికగా ఆయన పై చంద్రబాబు తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారని… ఆ సమయంలో విజయభాస్కర్ రెడ్డి చాలా ఆవేదన చెందారని గుర్తు చేశారు.

ఇందుకు స్పందించిన కృష్ణారావు …. అడ్డగాడిదలే కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి అంతటి నిజాయితీపరుడు ఈ దేశ రాజకీయాల్లోనే ఎవరూ లేరన్నారు. అలాంటి వ్యక్తిపై అవినీతి ఆరోపణలు చేసే వారు ఎవరైనా సరే అడ్డగాడిదలతో సమానమేనన్నారు.

రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసినా కూడా హైదరాబాద్‌లో ఒక ఇంటిని కూడా నిర్మించుకోలేకపోయిన నిజాయితీపరుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని కృష్ణారావు చెప్పారు. అలాంటి వ్యక్తికి కుమారుడైన కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి… ఈరోజు చంద్రబాబుకు చప్పట్లు కొడుతున్నారంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు.

First Published:  31 Jan 2019 1:05 AM GMT
Next Story