అధికార భవనం ఖాళీ చేసిన హరీష్... పార్టీలో చర్చ...
మాజీ మంత్రి హరీష్‌రావు అధికారిక భవనాన్ని ఖాళీ చేశారు. మినిస్టర్ బంగ్లాను ఖాళీ చేసేశారు. ఇప్పుడు ఈ అంశం టీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశమైంది. మొన్నటి కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన వారు ఇంకా మినిస్టర్స్ క్వార్టర్స్ ను ఖాళీ చేయలేదు. హరీష్‌రావు మాత్రం బంగ్లాను ఖాళీ చేయడంతో కొత్త ప్రభుత్వంలో ఆయన పాత్ర ఎలా ఉంటుందన్న దానిపై చర్చ మొదలైంది. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండడం, ఈ సమయంలో హరీష్‌రావు బంగ్లాను ఖాళీ చేయడం ఆసక్తిగా ఉంది. కొత్త కేబినెట్‌లో […]
BY sarvi30 Jan 2019 9:27 PM GMT
X
sarvi Updated On: 30 Jan 2019 9:33 PM GMT
మాజీ మంత్రి హరీష్‌రావు అధికారిక భవనాన్ని ఖాళీ చేశారు. మినిస్టర్ బంగ్లాను ఖాళీ చేసేశారు. ఇప్పుడు ఈ అంశం టీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశమైంది.
మొన్నటి కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన వారు ఇంకా మినిస్టర్స్ క్వార్టర్స్ ను ఖాళీ చేయలేదు. హరీష్‌రావు మాత్రం బంగ్లాను ఖాళీ చేయడంతో కొత్త ప్రభుత్వంలో ఆయన పాత్ర ఎలా ఉంటుందన్న దానిపై చర్చ మొదలైంది.
త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండడం, ఈ సమయంలో హరీష్‌రావు బంగ్లాను ఖాళీ చేయడం ఆసక్తిగా ఉంది. కొత్త కేబినెట్‌లో హరీష్‌రావుకు చోటు ఉంటుందా ?ఉండదా?…. సీఎం ఆదేశాలతోనే ఆయన బంగ్లాను ఖాళీ చేశారా?, లేక సాధారణంగానే చేశారా? అన్నది చర్చనీయాంశమైంది.
Next Story