Telugu Global
International

చికాగోలో పట్టాలు తగులబెడుతున్న రైల్వే కంపెనీ.... కారణం ఏంటంటే..!

అమెరికాలోని చికాగో రాష్ట్రంలో రైలు పట్టాలు తగలబడుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే ఏ దుండగుల చర్యో.. ఆకతాయిల పనో కాదు. సాక్షాత్తూ అక్కడి రైల్వే ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ “మెట్రా” స్వయంగా ఈ పని చేస్తోంది. ఇంత పిచ్చి పని ఎందుకు చేస్తోందంటూ కోప్పడకండీ..! ఆ పట్టాలు తగులబెట్టడానికి ఒక మంచి కారణమే ఉందండోయ్. అమెరికాలో పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడి పోయాయి. తీవ్రమైన చలి గాలుల నేపథ్యంలో అంటార్కిటికా ఉష్ణోగ్రతల కంటే […]

చికాగోలో పట్టాలు తగులబెడుతున్న రైల్వే కంపెనీ.... కారణం ఏంటంటే..!
X

అమెరికాలోని చికాగో రాష్ట్రంలో రైలు పట్టాలు తగలబడుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే ఏ దుండగుల చర్యో.. ఆకతాయిల పనో కాదు. సాక్షాత్తూ అక్కడి రైల్వే ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ “మెట్రా” స్వయంగా ఈ పని చేస్తోంది. ఇంత పిచ్చి పని ఎందుకు చేస్తోందంటూ కోప్పడకండీ..! ఆ పట్టాలు తగులబెట్టడానికి ఒక మంచి కారణమే ఉందండోయ్.

అమెరికాలో పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడి పోయాయి. తీవ్రమైన చలి గాలుల నేపథ్యంలో అంటార్కిటికా ఉష్ణోగ్రతల కంటే దారుణంగా పడిపోయాయి. అక్కడ జనజీవనం స్తంభించడమే కాక.. రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా రైల్వే సంస్థలు పట్టాలను రక్షించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి పడిపోవడంతో పట్టాలు భిగుసుకొని పోయాయి. ముఖ్యంగా రైళ్లు పట్టాలు మారే స్విచ్చింగ్ ప్రదేశాల్లో ఈ చల్లదనానికి పట్టాలు విరిగిపోయే ప్రమాదం ఏర్పడింది. అంతే కాకుండా అక్కడ ఎక్కువ శాతం పట్టాలను వెల్డింగ్ ద్వారా కలుపుతారు. దీంతో ఎక్కడైతే పట్టాలను కలుపుతూ వెల్డింగ్ చేశారో అక్కడ నెర్రలు బారాయి. అందుకే పట్టాలను పునరుద్దరించడానికి ఇలా మంటలు పెడుతున్నారు.

మందపాటి తాళ్లను కిరోసిన్‌లో ముంచి పట్టాల వారగా ఉంచి మంట పెడుతున్నారు. అప్పుడు పట్టాలు వేడై సాగుతున్నాయి. అదే సమయంలో పగుళ్లు వచ్చిన దగ్గర బోల్టులు వేసి సరిచేస్తున్నారు.

ఇలా మంటలు పెట్టి సరి చేసే సమయంలో తీసిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. చూపరులను కూడా అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

First Published:  31 Jan 2019 9:30 AM GMT
Next Story