Telugu Global
Cinema & Entertainment

"సై రా" విషయంలో భయపడుతున్న రామ్ చరణ్

మెగా స్టార్ చిరంజీవి హీరోగా, రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమా “సై రా”. ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్టర్ చేస్తున్నాడు. ప్రస్తుతం భారీ సెట్స్ పై షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సగానికి పైగా గ్రాఫిక్స్ వర్కే ఉందట. ఇప్పుడిదే రామ్ చరణ్ ని తెగ భయపెడుతోందట. ఎందుకంటే గత ఏడాది విఎఫ్ఎక్స్ ని నమ్ముకొని రిలీజ్ అయిన “2.O” “తగ్స్ అఫ్ హిందూస్తాన్” […]

సై రా విషయంలో భయపడుతున్న రామ్ చరణ్
X

మెగా స్టార్ చిరంజీవి హీరోగా, రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమా “సై రా”. ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్టర్ చేస్తున్నాడు.

ప్రస్తుతం భారీ సెట్స్ పై షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సగానికి పైగా గ్రాఫిక్స్ వర్కే ఉందట. ఇప్పుడిదే రామ్ చరణ్ ని తెగ భయపెడుతోందట.

ఎందుకంటే గత ఏడాది విఎఫ్ఎక్స్ ని నమ్ముకొని రిలీజ్ అయిన “2.O” “తగ్స్ అఫ్ హిందూస్తాన్” వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచాయి. ఆ సినిమాల్లో కథ కంటే కూడా విఎఫ్ఎక్స్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల సినిమాలు పోయాయని చాలా మంది విశ్లేషకులు చెప్పారు. పోనీ విఎఫ్ఎక్స్ అయినా సూపర్ గా ఉన్నాయా అనుకుంటే అది లేదు.

అందుకే రామ్ చరణ్ “సై రా” విఎఫ్ఎక్స్ పనుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. ఎవరూ వేలెత్తి చూపించే వీలు లేకుండా ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్స్ పనులను చూసుకుంటున్నాడట రామ్ చరణ్. మరి “సై రా” రిలీజ్ అయ్యాక విఎఫ్ఎక్స్ పరంగా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

First Published:  29 Jan 2019 11:22 PM GMT
Next Story