Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబుకి నచ్చలేదు... రాజ్ తరుణ్ కు నచ్చుతుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు మరియు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాని శశి కుమార్ ముత్తులూరి అనే షార్ట్ ఫిలిం దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందే గల్లా జయదేవ్ హీరోగా క్రిష్ణా రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేసి ఆపేసాడు దిల్ రాజు. […]

మహేష్ బాబుకి నచ్చలేదు... రాజ్ తరుణ్ కు నచ్చుతుందా?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు మరియు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాని శశి కుమార్ ముత్తులూరి అనే షార్ట్ ఫిలిం దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా కంటే ముందే గల్లా జయదేవ్ హీరోగా క్రిష్ణా రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేసి ఆపేసాడు దిల్ రాజు. మహేష్ బాబు కి ఆ సినిమా కథ నచ్చకపోవడం వల్ల ఆ సినిమా ఆగిపోయింది.

అయితే ఇప్పుడు అదే సినిమా రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కించేందుకు దిల్ రాజ్ రంగం సిద్దం చేస్తున్నాడట. కథలో ఎలాంటి మార్పులు చేయకుండా రాజ్ తరుణ్ కు సరిపోయే సబ్జెక్ట్ కావడంతో దిల్ రాజు, దర్శకుడు కృష్ణారెడ్డి సిద్దమవుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

మరి అసలే ఫ్లాప్స్ లో ఉన్న రాజ్ తరుణ్… సూపర్ స్టార్ మహేష్ బాబుకి నచ్చని కథని ఓకే చేస్తాడో లేదో చూడాలి. దిల్ రాజు, రాజ్ తరుణ్ కాంబినేషన్ లో ఇంతకు ముందు “లవర్” అనే సినిమా వచ్చి ఫ్లాప్ గా నిలిచింది.

First Published:  30 Jan 2019 12:40 AM GMT
Next Story