Telugu Global
International

స్పైడర్‌ మ్యాన్ దుస్తుల్లో బ్యాంకు ఉద్యోగి.... అసలు కారణమేంటి...?

అప్పుడే బ్యాంకు తెరిచారు…. కస్టమర్లు ఒక్కొక్కరే లోపలికి వస్తున్నారు. అయితే అక్కడ ఒక డెస్కులో ఫోన్ కాల్ మాట్లాడుతూ, ఉద్యోగికి సలహాలు ఇస్తూ.. ఫైల్స్ మీద సంతకాలు చేస్తూ బిజీబిజీగా ఒక సూపర్ హీరో కనపడ్డాడు. అతడిని అక్కడ చూడగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ బ్యాంకులో పని చేస్తోంది సాక్షాత్తూ ‘స్పైడర్‌ మ్యాన్’..! అసలు స్పైడర్‌ మ్యాన్ ఏంటీ.. అక్కడ ఉద్యోగం చేయడమేంటనేగా మీ డౌట్..? అసలు విషయం ఆ స్పైడర్‌ మ్యాన్ కొలీగ్ […]

స్పైడర్‌ మ్యాన్ దుస్తుల్లో బ్యాంకు ఉద్యోగి.... అసలు కారణమేంటి...?
X

అప్పుడే బ్యాంకు తెరిచారు…. కస్టమర్లు ఒక్కొక్కరే లోపలికి వస్తున్నారు. అయితే అక్కడ ఒక డెస్కులో ఫోన్ కాల్ మాట్లాడుతూ, ఉద్యోగికి సలహాలు ఇస్తూ.. ఫైల్స్ మీద సంతకాలు చేస్తూ బిజీబిజీగా ఒక సూపర్ హీరో కనపడ్డాడు. అతడిని అక్కడ చూడగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ బ్యాంకులో పని చేస్తోంది సాక్షాత్తూ ‘స్పైడర్‌ మ్యాన్’..!

అసలు స్పైడర్‌ మ్యాన్ ఏంటీ.. అక్కడ ఉద్యోగం చేయడమేంటనేగా మీ డౌట్..? అసలు విషయం ఆ స్పైడర్‌ మ్యాన్ కొలీగ్ అయిన వాల్టర్ కోస్టా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ స్పైడర్ వేషంలో ఉన్న వ్యక్తి తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు… కాని ఇది అతనికి బ్యాంకు ఉద్యోగంలో చివరి రోజు. తన రిటైర్మెంట్ రోజు జీవితంలో గుర్తుండిపోవాలని ఇలా తనకు ఇష్టమైన స్పైడర్ గెటప్‌లో వచ్చాడని వెల్లడించాడు. బ్రెజిల్‌లోని సాల్ పౌలో బ్యాంకు ఉద్యోగి చేసిన వింత సాహసం ఇది.

తడి ఉద్యోగపు చివరి రోజును ఇలా సెలబ్రేట్ చేసుకోవడంపై నెటిజన్లు పాజిటీవ్‌గా స్పందిస్తున్నారు. వాల్టర్ పెట్టిన పోస్టుకు ఇప్పటికే 98 వేల వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

First Published:  29 Jan 2019 6:36 AM GMT
Next Story