Telugu Global
NEWS

వైసీపీ ఎమ్మెల్యేలు సభ్యత్వాలు కోల్పోతారని స్పీకర్ హెచ్చరిక

వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకపోవడాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తప్పుపట్టారు. రేపటి నుంచి వచ్చే నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు. సభలో ప్రతిపక్షం లేకపోవడం స్పీకర్‌కు అసంతృప్తిగానే ఉంటుందన్నారు. ఇరు పక్షాలు ఉన్నప్పుడే స్పీకర్‌కు చాలెంజింగ్‌గా ఉంటుందని వ్యాఖ్యానించారు. వైసీపీ సభ్యులను అసెంబ్లీకి రావాల్సిందిగా మరోసారి కోరుతున్నానని చెప్పారు. ఈ విషయంలో జగన్‌తో మాట్లాడేందుకు తాను ప్రయత్నించినా అటు నుంచి అవకాశం ఇవ్వలేదన్నారు. సెలవు తీసుకోకుండా సభ్యులు సభకు […]

వైసీపీ ఎమ్మెల్యేలు సభ్యత్వాలు కోల్పోతారని స్పీకర్ హెచ్చరిక
X

వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకపోవడాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తప్పుపట్టారు. రేపటి నుంచి వచ్చే నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు.

సభలో ప్రతిపక్షం లేకపోవడం స్పీకర్‌కు అసంతృప్తిగానే ఉంటుందన్నారు. ఇరు పక్షాలు ఉన్నప్పుడే స్పీకర్‌కు చాలెంజింగ్‌గా ఉంటుందని వ్యాఖ్యానించారు. వైసీపీ సభ్యులను అసెంబ్లీకి రావాల్సిందిగా మరోసారి కోరుతున్నానని చెప్పారు.

ఈ విషయంలో జగన్‌తో మాట్లాడేందుకు తాను ప్రయత్నించినా అటు నుంచి అవకాశం ఇవ్వలేదన్నారు. సెలవు తీసుకోకుండా సభ్యులు సభకు హాజరు కాకపోతే నిబంధనల ప్రకారం సభ్యత్వాలు రద్దవుతాయని స్పీకర్ కోడెల వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 5న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతారని స్పీకర్ వివరించారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయనందుకు నిరసనగా వైసీపీ అసెంబ్లీని బహిష్కరించింది. ఆ విషయంలో మాత్రం స్పీకర్ నోరు మెదపడం లేదు.

First Published:  29 Jan 2019 6:34 AM GMT
Next Story