Telugu Global
Cinema & Entertainment

5 కోట్ల లాభం.... 8 కోట్ల నష్టం

భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక డిజాస్టర్ గా మిగిలింది. 72 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా…. కలెక్షన్స్ లో మాత్రం కేవలం 20 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. అంటే డిస్ట్రిబ్యూటర్లు 50 కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని ఎదుర్కొన్నారు. మిగతా అందరితో పోలిస్తే సాయి కొర్రపాటి పరిస్థితి ఆసక్తిగా ఉంది. ఈ సినిమాతో లాభాల కంటే నష్టాలే ఎక్కువ వచ్చాయి సాయి కొర్రపాటి కి. ఈ సినిమాకి సహా […]

5 కోట్ల లాభం.... 8 కోట్ల నష్టం
X

భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక డిజాస్టర్ గా మిగిలింది. 72 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా…. కలెక్షన్స్ లో మాత్రం కేవలం 20 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. అంటే డిస్ట్రిబ్యూటర్లు 50 కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని ఎదుర్కొన్నారు.

మిగతా అందరితో పోలిస్తే సాయి కొర్రపాటి పరిస్థితి ఆసక్తిగా ఉంది. ఈ సినిమాతో లాభాల కంటే నష్టాలే ఎక్కువ వచ్చాయి సాయి కొర్రపాటి కి. ఈ సినిమాకి సహా నిర్మాతగానే కాక…. రెండు ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్ గా మారాడు సాయి కొర్రపాటి.

సహ నిర్మాతగా వ్యవహరించిన సాయి కొర్రపాటి కి ఐదు కోట్ల లాభం లభించింది. అయితే డిస్ట్రిబ్యూటర్ గా మాత్రం 8 కోట్ల నష్టం వాటిల్లింది. నిర్మాతగా వచ్చిన ఐదు కోట్లు తీసేయగా పైపెచ్చు మూడు కోట్ల నష్టం కలిగింది.

నిజానికి ఈ సినిమా ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఈ సినిమా ఫెయిల్యూర్ రెండవ భాగమైన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ పై పడుతుందని సినిమా వర్గాల అంచనా.

అయితే సినిమాకి ముగ్గురు నిర్మాతలు కాబట్టి సరిపోయింది కానీ… అదే సోలోగా ఎవరైనా తీసుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని అంటున్నారు.

First Published:  28 Jan 2019 11:41 PM GMT
Next Story