Telugu Global
Cinema & Entertainment

ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం “మజిలి” షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. సమంతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 5 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఫిబ్రవరి 21 నుంచి “వెంకీ మామ” షూటింగ్ లో బిజీగా ఉంటాడు నాగ చైతన్య. వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సురేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తుండగా బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్ […]

ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో నాగ చైతన్య
X

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం “మజిలి” షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. సమంతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 5 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

ఇక ఫిబ్రవరి 21 నుంచి “వెంకీ మామ” షూటింగ్ లో బిజీగా ఉంటాడు నాగ చైతన్య. వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సురేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తుండగా బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే ఇప్పుడు మూడో సినిమా కన్ఫర్మ్ చేసాడు అక్కినేని నాగ చైతన్య.

“చందమామ కథలు” ”గరుడ వేగ” సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం “బాహుబలి” వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న ప్రవీణ్ సత్తారు అది అయిపోయిన వెంటనే నాగ చైతన్యతో సినిమా చేయనున్నాడు. కామాక్షి మూవీస్ సంస్థ ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేయనుంది.

మొత్తానికి ఈ ఏడాది మూడు సినిమాలని లైన్ లో పెట్టి బిజీ మోడ్ లోకి వెళ్ళిపోనున్నాడు నాగ చైతన్య.

First Published:  29 Jan 2019 12:15 AM GMT
Next Story