Telugu Global
Cinema & Entertainment

అఖిల్ ని రెస్ట్ తీసుకోమన్న నాగార్జున?

అక్కినేని అఖిల్…..అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా వి.వి వినాయక్ సినిమాతో గ్రాండ్ గా లాంచ్ చేయించాడు అక్కినేని నాగార్జున. “అఖిల్” సినిమా భారీ బడ్జెట్ తో రూపొంది…. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఫ్లాప్ ని అందుకుంది. ఇక అఖిల్ రెండవ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలన్న ఉద్దేశ్యంతో నాగార్జున విక్రం కే కుమార్ ని తీసుకొచ్చి మరి “హలో” సినిమా తీయించాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కాకపోయినా ఓ మోస్తరు సినిమాగా నిలిచింది. ఈ […]

అఖిల్ ని రెస్ట్ తీసుకోమన్న నాగార్జున?
X

అక్కినేని అఖిల్…..అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా వి.వి వినాయక్ సినిమాతో గ్రాండ్ గా లాంచ్ చేయించాడు అక్కినేని నాగార్జున. “అఖిల్” సినిమా భారీ బడ్జెట్ తో రూపొంది…. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఫ్లాప్ ని అందుకుంది.

ఇక అఖిల్ రెండవ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలన్న ఉద్దేశ్యంతో నాగార్జున విక్రం కే కుమార్ ని తీసుకొచ్చి మరి “హలో” సినిమా తీయించాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కాకపోయినా ఓ మోస్తరు సినిమాగా నిలిచింది. ఈ సినిమా అఖిల్ కెరీర్ కు పెద్దగా ప్లస్ కాలేకపోయింది.

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అఖిల్ కెరీర్ కి గట్టి హిట్ అవసరం ఏర్పడింది. దీంతో డైరెక్టర్ వెంకీ అట్లూరి తో “మిస్టర్ మజ్ను” చేయించాడు నాగార్జున. అఖిల్ కి మంచి హిట్ ని అందిస్తుందనుకున్న ఈ సినిమా కాస్త బాక్స్ ఆఫీసు దగ్గర బొక్క బోర్లా పడింది.

ఇక ఇప్పుడు నాగార్జున అఖిల్ ని కొన్ని రోజుల పాటు ఎలాంటి కథలు వినకుండా సినిమాలకు దూరంగా విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించాడట. మరి ఈ కాస్త గ్యాప్ లో నాగార్జున అఖిల్ కోసం ఎలాంటి ప్రాజెక్టు సెట్ చేస్తాడో చూడాలి.

First Published:  29 Jan 2019 2:03 AM GMT
Next Story