2020 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారు
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సమరం ఒకే ఏడాది పురుషుల, మహిళల టీ-20 ప్రపంచకప్ టోర్నీ పురుషుల ప్రారంభమ్యాచ్ లో సౌతాఫ్రికాతో టీమిండియా ఢీ మహిళల టీ-20 ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ లో ఆసీస్ తో భారత్ సమరం ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరిగే ఐసీసీ టీ-20 ప్రపంచకప్ పురుషుల, మహిళల టోర్నీల షెడ్యూల్ ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. టీ-20 ప్రపంచకప్ చరిత్రలోనే… తొలిసారిగా ఒకే ఏడాది… కొద్దివారాల తేడాలో…. పురుషుల, మహిళల ప్రపంచకప్ […]
- ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సమరం
- ఒకే ఏడాది పురుషుల, మహిళల టీ-20 ప్రపంచకప్ టోర్నీ
- పురుషుల ప్రారంభమ్యాచ్ లో సౌతాఫ్రికాతో టీమిండియా ఢీ
- మహిళల టీ-20 ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ లో ఆసీస్ తో భారత్ సమరం
ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరిగే ఐసీసీ టీ-20 ప్రపంచకప్ పురుషుల, మహిళల టోర్నీల షెడ్యూల్ ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
టీ-20 ప్రపంచకప్ చరిత్రలోనే… తొలిసారిగా ఒకే ఏడాది… కొద్దివారాల తేడాలో…. పురుషుల, మహిళల ప్రపంచకప్ టోర్నీలు నిర్వహించడానికి ఐసీసీ ఏర్పాట్లు చేసింది.
2020 అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకూ పురుషుల ప్రపంచకప్ నిర్వహిస్తారు. మహిళా టీ-20 ప్రపంచకప్ ఫిబ్రవరి 21న ప్రారంభమై…ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8న ముగియనుంది.
ఆస్ట్రేలియాలోని మొత్తం ఎనిమిది నగరాలలోని 13 వేదికల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. పురుషుల విభాగంలో టీమిండియా తన ప్రారంభమ్యాచ్ ను… పెర్త్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ఆడనుంది.
మహిళల విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియాతో భారత్ ఫిబ్రవరి 21న జరిగే ప్రారంభమ్యాచ్ లో ఢీ కొంటుంది. మహిళల గ్రూప్- ఏ లీగ్ లో ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ తో పాటు మరో క్వాలిఫైయర్ జట్లతో భారత్ పోటీపడుతుంది.
పురుషుల సూపర్ -12 రౌండ్లో ఆస్ట్రేలియా, అప్ఘనిస్థాన్, ఇంగ్లండ్ జట్లతో పాటు…క్వాలిఫైయింగ్ రౌండ్ల నుంచి అర్హత సాధించిన మరో రెండుజట్లతో టీమిండియా తలపడాల్సి ఉంది.
Here is the draw for the men's #T20WorldCup in 2020!
Which Super 12 route will be tougher to reach the semi-finals from? pic.twitter.com/C276LkqNgD
— ICC (@ICC) January 29, 2019
Here's how the teams will be grouped for the @ICC Women's #T20WorldCup 2020 in Australia! What will the key match-ups be? pic.twitter.com/EOt8MC8NP4
— ICC T20 World Cup (@T20WorldCup) January 28, 2019