Telugu Global
National

కుమార మంగళం బిర్లాకు ఒక 'సీక్రెట్ ఇన్‌స్టాగ్రామ్' అకౌంట్ ఉందంట..! ఎందుకో తెలుసా..?

ఆదిత్యా బిర్లా గ్రూప్ యజమాని, దేశంలోని బిలియనీర్లలో ఒకడైన కుమార మంగళం బిర్లా రహస్యంగా ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఉపయోగిస్తున్నారంట. అంతపెద్ద బిలియనీర్ రహస్యంగా ఎందుకు సోషల్ మీడియాలో ఉన్నారు..? ఓపెన్‌గానే ఆనంద్ మహీంద్రలా అకౌంట్ మెయింటైన్ చేయొచ్చు కదా..! అని మీకు డౌటా..? అయితే ఈ సీక్రెట్ అకౌంట్ వెనుక అసలు విషయాన్ని తెలుసుకోండి. కుమార మంగళం బిర్లా పెద్ద కూతురు అనన్య బిర్లా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఇవాళ ఒక పోస్టు పెట్టింది. తన […]

కుమార మంగళం బిర్లాకు ఒక సీక్రెట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉందంట..! ఎందుకో తెలుసా..?
X

ఆదిత్యా బిర్లా గ్రూప్ యజమాని, దేశంలోని బిలియనీర్లలో ఒకడైన కుమార మంగళం బిర్లా రహస్యంగా ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఉపయోగిస్తున్నారంట. అంతపెద్ద బిలియనీర్ రహస్యంగా ఎందుకు సోషల్ మీడియాలో ఉన్నారు..? ఓపెన్‌గానే ఆనంద్ మహీంద్రలా అకౌంట్ మెయింటైన్ చేయొచ్చు కదా..! అని మీకు డౌటా..? అయితే ఈ సీక్రెట్ అకౌంట్ వెనుక అసలు విషయాన్ని తెలుసుకోండి.

కుమార మంగళం బిర్లా పెద్ద కూతురు అనన్య బిర్లా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఇవాళ ఒక పోస్టు పెట్టింది. తన తండ్రి కేఎం బిర్లాతో కలిసి ఉన్న ఆ ఫొటోకు ఒక మెసేజ్ కూడా రాసింది. – “ఆయన నన్ను ఇంత లోతుగా ఎలా అర్థం చేసుకుంటారో తెలియదు. ఐ లవ్ యూ నాన్నా. నా గౌను రంగుతో ఆయన టైని మ్యాచ్ చేయడానికి తీవ్రంగా శ్రమించారు. ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. నాన్నా నన్ను గమనించడానికి నువ్వు క్రియేట్ చేసుకున్న సీక్రెట్ అకౌంట్ నుంచి ఈ పోస్టును చూడవచ్చు”.

ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది కుమార మంగళం బిర్లా సీక్రెట్ అకౌంట్ ఏంటా అని గెస్ చేస్తున్నారు. ఈ ఫొటో గత నవంబర్ నెలలో అనన్య జీక్యూ లిస్టులో ఎంపికైన సందర్భంగా దిగింది. దాన్ని ఇవాళ మరో సారి పోస్టు చేసింది. అనన్య తండ్రి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా తను మాత్రం సింగింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. తన తొలి ఆల్బమ్ ‘లివిన్ ద లైఫ్’ను 2016లో విడుదల చేసింది.

First Published:  28 Jan 2019 10:00 PM GMT
Next Story