Telugu Global
Cinema & Entertainment

సైరాకు సింగిల్ కార్డు....

తెల్లదొరలను హడలెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సైరా సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. రాంచరణే స్వయంగా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి నరసింహారెడ్డిగా కత్తి దూయబోతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాటలు కూడా అదే రేంజ్‌లోఉండేలా జాగ్రత్తపడుతున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే… ఈ సినిమాకు అన్ని పాటలను ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్తి రాస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే వెల్లడించారు. సైరాకు అన్ని పాటలు సిరివెన్నెలే […]

సైరాకు సింగిల్ కార్డు....
X

తెల్లదొరలను హడలెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సైరా సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. రాంచరణే స్వయంగా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి నరసింహారెడ్డిగా కత్తి దూయబోతున్నారు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాటలు కూడా అదే రేంజ్‌లోఉండేలా జాగ్రత్తపడుతున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే… ఈ సినిమాకు అన్ని పాటలను ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్తి రాస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే వెల్లడించారు.

సైరాకు అన్ని పాటలు సిరివెన్నెలే రాస్తున్నారని… ఈసారి జాతీయ అవార్డు ఖచ్చితంగా సిరివెన్నెలకు వస్తుందని చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. తాను నటించిన రుద్రవీణకు కూడా అన్ని పాటలూ సిరివెన్నెలే రాశారని గుర్తు చేస్తున్నారు.

గతంలోనే జాతీయ అవార్డు ఒక్క ఓటుతో మిస్ అయిందని… ఈసారి మాత్రం జాతీయ అవార్డు ఖాయమని చిరంజీవి వ్యాఖ్యానించారు.

First Published:  29 Jan 2019 12:29 AM GMT
Next Story