Telugu Global
NEWS

చంద్రబాబు ఆపని కూడా చేస్తారు... మేం సిద్ధంగా ఉన్నాం...

బంద్‌ల వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని మొన్నటి వరకు బంద్‌ చేసే వారిని అరెస్ట్ చేయించిన చంద్రబాబు … ఇప్పుడు స్వయంగా బంద్‌లకు ఎలా మద్దతు ఇస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. లగడపాటి, ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబులు కలిసి రహస్యంగా కుట్ర సమావేశాలు పెట్టుకోవచ్చు గానీ… ముద్రగడ నాయకత్వంలో కాపులు సమావేశం అయితే మాత్రం అనుమతి ఇవ్వరా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఈ వివక్ష ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణలో చేసినట్టుగానే లగడపాటిని అడ్డుపెట్టుకుని సర్వేల […]

చంద్రబాబు ఆపని కూడా చేస్తారు... మేం సిద్ధంగా ఉన్నాం...
X

బంద్‌ల వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని మొన్నటి వరకు బంద్‌ చేసే వారిని అరెస్ట్ చేయించిన చంద్రబాబు … ఇప్పుడు స్వయంగా బంద్‌లకు ఎలా మద్దతు ఇస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు.

లగడపాటి, ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబులు కలిసి రహస్యంగా కుట్ర సమావేశాలు పెట్టుకోవచ్చు గానీ… ముద్రగడ నాయకత్వంలో కాపులు సమావేశం అయితే మాత్రం అనుమతి ఇవ్వరా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఈ వివక్ష ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణలో చేసినట్టుగానే లగడపాటిని అడ్డుపెట్టుకుని సర్వేల పేరుతో ప్రజలను గందరగోళపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని… వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. తెలంగాణలో ఏదో విధంగా మహాకూటమిని అధికారంలోకి రప్పించాలని లగడపాటి చేసిన ప్రయత్నాలన్నీ ప్రజలు గమనించారన్నారు.

కేంద్రం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తే… అందులో కాపులకు ఐదు శాతం ఇస్తానని చంద్రబాబు చెప్పడం కాపులను మోసం చేయడమేనన్నారు. చట్టప్రకారం అది సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు కాపులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంబటి ఆరోపించారు. హోదా కోసం ఢిల్లీ వెళ్లి దీక్ష చేస్తానంటున్న చంద్రబాబు ఇన్నేళ్లు ఏం చేశారని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

కేంద్రం అన్ని హామీలను నెరవేరుస్తోంది కాబట్టే బీజేపీతో కలిసి ఉన్నామని చంద్రబాబు చెప్పింది నిజం కాదా అని నిలదీశారు. ఐదేళ్లలో ఏం చేశారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న చంద్రబాబు… ఇప్పుడు తిరిగి అధికారంలోకి వస్తే అవి చేస్తాం, ఇవి చేస్తామంటూ మభ్యపెడుతున్నారని అంబటి విమర్శించారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ… తటస్తుల ముసుగులో కొందరిని తెరపైకి తెచ్చి… వారితో చంద్రబాబు పాలన బాగుంది అని చెప్పించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని… వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.

First Published:  29 Jan 2019 4:15 AM GMT
Next Story