Telugu Global
Cinema & Entertainment

మళ్ళీ అదే సబ్జెక్ట్ తో .... బన్నీ- త్రివిక్రమ్?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా ఓకే అయిన సంగతి అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ ఎంతో మంది దర్శకుల కథలు విన్న తరువాత త్రివిక్రమ్ సినిమా ఓకే చేసాడు. ఎందుకంటే త్రివిక్రమ్ తనకి మంచి హిట్ ఇస్తాడు అనే నమ్మకం అల్లు అర్జున్ కి ఉంది. ఇక త్రివిక్రమ్ కూడా బన్నీ కి సూపర్ హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి కథతో ప్రేక్షకుల ముందుకి రావాలని చూస్తున్నాడు. అయితే […]

మళ్ళీ అదే సబ్జెక్ట్ తో .... బన్నీ- త్రివిక్రమ్?
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా ఓకే అయిన సంగతి అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ ఎంతో మంది దర్శకుల కథలు విన్న తరువాత త్రివిక్రమ్ సినిమా ఓకే చేసాడు. ఎందుకంటే త్రివిక్రమ్ తనకి మంచి హిట్ ఇస్తాడు అనే నమ్మకం అల్లు అర్జున్ కి ఉంది.

ఇక త్రివిక్రమ్ కూడా బన్నీ కి సూపర్ హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి కథతో ప్రేక్షకుల ముందుకి రావాలని చూస్తున్నాడు. అయితే మొదట వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎమోషనల్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం ఈ సారి బన్నితో ఒక కామెడీ సినిమా తీయాలని అనుకుంటున్నాడట. అది కూడా ఇద్దరు తండ్రి కొడుకుల మధ్య జరిగే కథ అంట.

ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో “సన్ అఫ్ సత్యమూర్తి” వంటి ఎమోషనల్ తండ్రి కొడుకుల కథ వచ్చింది. మరి అలాంటి ఎమోషనల్ కథని చూపించిన త్రివిక్రమ్…. ఈ సారి ఎలాంటి తండ్రి కొడుకుల కథ చూపిస్తాడో చూడాలి. ఈ సినిమాలో అల్లు అర్జున్ తండ్రి పాత్రలో ఎవరు నటిస్తారో అనేది కన్ఫర్మ్ కాలేదు.

First Published:  29 Jan 2019 7:29 AM GMT
Next Story