Telugu Global
Cinema & Entertainment

స్టుడియో రౌండప్ (28-01-2019)

సైరా చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో, రామోజీ ఫిలింసిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం ఓ భారీ జాతర సెట్ వేశారు. అదే సెట్ లో వెయ్యి మంది డాన్సర్లతో ఓ పాట షూట్ చేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ సాంగ్ షూటింగ్ ఉంటుంది. తర్వాత అదే సెట్ లో చిన్న యుద్ధ సన్నివేశం కూడా తీస్తారు. ఇస్మార్ట్ శంకర్ రామ్-పూరి కాంబోలో రీసెంట్ గా […]

స్టుడియో రౌండప్ (28-01-2019)
X

సైరా

చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో, రామోజీ ఫిలింసిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం ఓ భారీ జాతర సెట్ వేశారు. అదే సెట్ లో వెయ్యి మంది డాన్సర్లతో ఓ పాట షూట్ చేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ సాంగ్ షూటింగ్ ఉంటుంది. తర్వాత అదే సెట్ లో చిన్న యుద్ధ సన్నివేశం కూడా తీస్తారు.

ఇస్మార్ట్ శంకర్

రామ్-పూరి కాంబోలో రీసెంట్ గా ప్రారంభమైన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. రామ్ పై నిన్నటి వరకు ఓ యాక్షన్ బ్లాక్ తీశారు. ప్రస్తుతం కొంత టాకీ పార్ట్ షూటింగ్ నడుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, నభా నటేష్ ను ఎంపిక చేశారు.

మహర్షి

మహేష్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మహర్షి. ఈ సినిమాకు సంబంధించి ఇవాళ్టితో పొలాచ్చి షెడ్యూల్ కంప్లీట్ అయింది. వచ్చేనెల మొదటి వారంలో రామోజీ ఫిలింసిటీలో మరో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 26న సినిమాను విడుదల చేయబోతున్నారు

మజిలీ

నాగచైతన్య-సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మజిలీ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోస్ లో జరుగుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ-సమంత మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇదే స్టుడియోలో తర్వాత షెడ్యూల్ లో ఓ సాంగ్ తీయబోతున్నారు.

సీత

తేజ డైరక్ట్ చేస్తున్న సీత సినిమా ఫైనల్ షెడ్యూల్ లో ఉంది. 10 రోజులు షూట్ చేస్తే ఈ సినిమా టోటల్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్ గా మార్చి నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ దీనికి సంగీత దర్శకుడు.

గోపీచంద్ సినిమా

ఇండో-పాక్ బోర్డర్ లో షూటింగ్ జరుపుకుంటోంది గోపీచంద్ కొత్త సినిమా. తిరు ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం సరిహద్దులో యాక్షన్ డైరెక్టర్ సెల్వా ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. 50 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో షూట్ చేస్తారు.

First Published:  28 Jan 2019 10:00 AM GMT
Next Story