Telugu Global
Cinema & Entertainment

అఖిల్ సినిమా ఎఫెక్ట్.... వెంకీ అట్లూరికి ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ అవకాశం ఇస్తాడా?

“తొలిప్రేమ” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయి తొలి సినిమాతోనే హిట్ ని అందుకున్నాడు వెంకీ అట్లూరి. ఇక “తొలిప్రేమ” లాంటి సినిమాకి ప్రొడ్యూస్ చేసిన బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్…. ఇప్పుడు మళ్ళీ అదే డైరెక్టర్ తో “మిస్టర్ మజ్ను” అనే సినిమాని ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేశాడు. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్…. డైరెక్టర్ వెంకీ అట్లూరిని నమ్మి మరీ ఈ అవకాశం ఇచ్చాడు. కానీ వెంకీ మాత్రం […]

అఖిల్ సినిమా ఎఫెక్ట్.... వెంకీ అట్లూరికి ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ అవకాశం ఇస్తాడా?
X

“తొలిప్రేమ” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయి తొలి సినిమాతోనే హిట్ ని అందుకున్నాడు వెంకీ అట్లూరి. ఇక “తొలిప్రేమ” లాంటి సినిమాకి ప్రొడ్యూస్ చేసిన బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్…. ఇప్పుడు మళ్ళీ అదే డైరెక్టర్ తో “మిస్టర్ మజ్ను” అనే సినిమాని ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేశాడు.

అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్…. డైరెక్టర్ వెంకీ అట్లూరిని నమ్మి మరీ ఈ అవకాశం ఇచ్చాడు. కానీ వెంకీ మాత్రం ఆ నమ్మకాన్ని నిలుపుకోలేక పోయాడు.

అయితే “మిస్టర్ మజ్ను” సినిమా హిట్ అయితే…. నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, వెంకీ అట్లూరికి జూనియర్ ఎన్టీఆర్ తో అవకాశం ఇస్తానన్నాడట. కానీ వెంకీ అట్లూరి మాత్రం బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ కి భారీ ఫ్లాప్ ని ఇచ్చాడు.

మరి ఇలాంటి సమయంలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ వెంకీ అట్లూరి కి ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చి…. మళ్ళీ సినిమా ప్రొడ్యూస్ చేస్తాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్ గా మారింది.

First Published:  28 Jan 2019 7:01 AM GMT
Next Story