Telugu Global
NEWS

కోట్ల నాలుగైదు సీట్లు అడుగుతున్నారు " కేఈ

కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. చంద్రబాబుతో కోట్ల కుటుంబసభ్యులు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశాన్ని చంద్రబాబు కూడా మంత్రుల వద్ద ధృవీకరించారు. కర్నూలు ఎంపీ సీటుతో పాటు రెండు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తోంది. కోట్ల రాకపై మంత్రి కేఈ కృష్ణమూర్తి, ఎంపీ బుట్టా రేణుక తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కోట్ల చేరికపై తమకు ఎలాంటి సమాచారం లేదని వారిద్దరూ చెబుతున్నారు. తాను మరోసారి ఎంపీగానే […]

కోట్ల నాలుగైదు సీట్లు అడుగుతున్నారు  కేఈ
X

కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. చంద్రబాబుతో కోట్ల కుటుంబసభ్యులు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశాన్ని చంద్రబాబు కూడా మంత్రుల వద్ద ధృవీకరించారు. కర్నూలు ఎంపీ సీటుతో పాటు రెండు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తోంది.

కోట్ల రాకపై మంత్రి కేఈ కృష్ణమూర్తి, ఎంపీ బుట్టా రేణుక తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కోట్ల చేరికపై తమకు ఎలాంటి సమాచారం లేదని వారిద్దరూ చెబుతున్నారు. తాను మరోసారి ఎంపీగానే పోటీ చేయాలనుకుంటున్నానని బుట్టా రేణుక చెప్పారు.

కేఈ కాస్త ఘాటుగానే స్పందించారు. కోట్ల కుటుంబం టీడీపీలోకి వస్తున్న విషయం చంద్రబాబు తనకు చెప్పలేదన్నారు. ఆ సమాచారం కూడా తన వద్ద లేదన్నారు. కేఈ కుటుంబం టికెట్ ఆశిస్తున్న నియోజవకర్గాలను కోట్ల కుటుంబానికి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారన్న వార్తల పైన కేఈ స్పందించారు.

కోట్ల కుటుంబం ఒక ఎంపీ సీటుతో పాటు నాలుగైదు ఎమ్మెల్యే టికెట్లు అడుగుతున్నట్టు తమకు తెలుస్తోందన్నారు. కర్నూలు ఎంపీతో పాటు డోన్‌, ఆలూరు, కోడుమూరు టికెట్లను కోట్ల ఫ్యామిలీ అడుగుతోందని… నాలుగైదు సీట్లు అడిగితే కనీసం రెండైనా ఇస్తారన్న ఉద్దేశంతో అలా చేస్తుండవచ్చన్నారు. కోట్ల కుటుంబం టీడీపీలో చేరి… తమకు దక్కాల్సిన సీట్లు ఆశిస్తే అప్పుడు తాను స్పందిస్తానని కేఈ కృష్ణమూర్తి చెప్పారు.

First Published:  28 Jan 2019 6:09 AM GMT
Next Story