Telugu Global
NEWS

ఈ లెక్కన వైసీపీ స్కోర్ 130కిపైనే....

పోలింగ్‌ నాటికి పరిస్థితులు ఎలా మారుతాయో గానీ… ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఏపీలో చంద్రబాబుకు ఘోర పరాజయం తప్పదని సర్వేలన్నీ ఘోషిస్తున్నాయి. తాజాగా రిపబ్లిక్‌ టీవీ- సీ ఓటర్ సంస్థలు నిర్వహించిన సర్వేలోనూ వైసీపీ ఏపీలో స్వీప్‌ చేయబోతోందని వెల్లడైంది. 25 ఎంపీ స్థానాలకు గాను వైసీపీ 19 స్థానాలను సొంతం చేసుకోబోతోంది. అధికార టీడీపీ ఈసారి ఆరు స్థానాలకే పరిమితం కానుంది. ఓట్ల శాతం పరంగానూ టీడీపీ- వైసీపీ మధ్య గ్యాప్‌ ఎక్కువగానే ఉంది. […]

ఈ లెక్కన వైసీపీ స్కోర్ 130కిపైనే....
X

పోలింగ్‌ నాటికి పరిస్థితులు ఎలా మారుతాయో గానీ… ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఏపీలో చంద్రబాబుకు ఘోర పరాజయం తప్పదని సర్వేలన్నీ ఘోషిస్తున్నాయి.

తాజాగా రిపబ్లిక్‌ టీవీ- సీ ఓటర్ సంస్థలు నిర్వహించిన సర్వేలోనూ వైసీపీ ఏపీలో స్వీప్‌ చేయబోతోందని వెల్లడైంది. 25 ఎంపీ స్థానాలకు గాను వైసీపీ 19 స్థానాలను సొంతం చేసుకోబోతోంది. అధికార టీడీపీ ఈసారి ఆరు స్థానాలకే పరిమితం కానుంది.

ఓట్ల శాతం పరంగానూ టీడీపీ- వైసీపీ మధ్య గ్యాప్‌ ఎక్కువగానే ఉంది. వైసీపీకి 41.3 శాతం , టీడీపీకి 33. 1 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని సర్వే తేల్చింది.

ఈ సర్వే ఫలితాల ఆధారంగా అంచనా వేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 130కిపైగా అసెంబ్లీ స్థానాలు దక్కే చాన్స్ ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ- టీడీపీ కాకుండా మరే ఇతర పార్టీ కూడా ఏపీలో ఖాతా తెరిచే అవకాశం లేదు.

First Published:  24 Jan 2019 8:49 PM GMT
Next Story