Telugu Global
NEWS

నీ కోసం జగన్‌ ఆయన్ను వదులుకున్నది నిజం కాదా రాధా ?

వంగవీటి రాధా చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారని వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యానించారు. సింహం కడుపున పుట్టిన రాధా ఇలా నక్కజిత్తుల చంద్రబాబు చెంతకు చేరడం బాధగా ఉందన్నారు. నక్కకు కుందేలు చిక్కినట్టుగా పరిస్థితి తయారైందన్నారు. పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి స్వయంగా జగనే ఫోన్ చేయించారని… కానీ రాధానే అందుబాటులోకి రాలేదన్నారు. రంగా ఆశయాలను చంద్రబాబు నెరవేరుస్తారని రాధా భావించడం భ్రమేనన్నారు. రాధా పర్యటనలకు ఏనాడు జగన్‌ అడ్డుపడ లేదని… పైగా పర్యటనలకు వెళ్లినప్పుడు పార్టీ నేతలను […]

నీ కోసం జగన్‌ ఆయన్ను వదులుకున్నది నిజం కాదా రాధా ?
X

వంగవీటి రాధా చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారని వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యానించారు. సింహం కడుపున పుట్టిన రాధా ఇలా నక్కజిత్తుల చంద్రబాబు చెంతకు చేరడం బాధగా ఉందన్నారు. నక్కకు కుందేలు చిక్కినట్టుగా పరిస్థితి తయారైందన్నారు. పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి స్వయంగా జగనే ఫోన్ చేయించారని… కానీ రాధానే అందుబాటులోకి రాలేదన్నారు.

రంగా ఆశయాలను చంద్రబాబు నెరవేరుస్తారని రాధా భావించడం భ్రమేనన్నారు. రాధా పర్యటనలకు ఏనాడు జగన్‌ అడ్డుపడ లేదని… పైగా పర్యటనలకు వెళ్లినప్పుడు పార్టీ నేతలను కలవాలని, వారు కూడా మిమ్మల్ని కలవడానికి ఇష్టపడుతున్నారని రాధాకు జగన్‌ సూచించారన్నారు.

రాధాను జగన్‌ సొంత తమ్ముడిలా చూసుకున్నారన్నారు. ఒక్క రాధాను బాధపెట్టకూడదనే సీనియర్ నేత దేవినేని నెహ్రు పార్టీలో చేరేందుకు వచ్చినా జగన్‌ తీసుకోలేదన్నారు. అందుకు తాను, జోగి రమేష్, బొత్స సత్యనారాయణే సాక్ష్యులమని చెప్పారు. రాధాను ఇబ్బంది పెట్టాలనుకుని జగన్‌ ఉంటే ఆ రోజే దేవినేని నెహ్రును పార్టీలోకి తీసుకునేవారన్నారు. రాధాకు బాధకలిగించే పని చేయకూడదని నెహ్రు రాకను జగన్ స్వాగతించలేదని… దాని వల్లే ఆయన టీడీపీలోకి వెళ్లిపోయారని వివరించారు. ఈ విషయం రాధా అంతరాత్మకు కూడా తెలుసన్నారు.

తలసాని శ్రీనివాసయాదవ్‌ను పార్టీ నేతలెవరైనా వ్యక్తిగతంగా కలిసినా, ఆహ్వానం పలికినా సస్పెండ్ చేసి పారేస్తానని చంద్రబాబు బహిరంగంగానే హెచ్చరించారని… అలాంటి పార్టీ స్వేచ్చ గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందని పేర్నినాని ఎద్దేవా చేశారు.

First Published:  24 Jan 2019 5:33 AM GMT
Next Story