Telugu Global
Cinema & Entertainment

హైటెక్ లుక్ కోసం "మిస్టర్" పెట్టారట

మిస్టర్ మజ్ను సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు అఖిల్. మజ్ను అనే టైటిల్ తమ కుటుంబానికి బాగా కలిసొచ్చిందని, తనకు కూడా మజ్ను సినిమా కెరీర్ లో ఓ హిట్ సినిమాగా నిలిచిపోతుందని అంటున్నాడు. అయితే కేవలం మజ్ను అని పెట్టకుండా మిస్టర్ అనే పదాన్ని తగిలించడం వెనక రీజన్ బయటపెట్టాడు అఖిల్. “మజ్ను అనే టైటిల్ పెట్టడానికి ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఓల్డ్ ఫీల్ వస్తుందని మాత్రం అంతా సలహా ఇచ్చారు. వాళ్లందరి […]

హైటెక్ లుక్ కోసం మిస్టర్ పెట్టారట
X

మిస్టర్ మజ్ను సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు అఖిల్. మజ్ను అనే టైటిల్ తమ కుటుంబానికి బాగా కలిసొచ్చిందని, తనకు కూడా మజ్ను సినిమా కెరీర్ లో ఓ హిట్ సినిమాగా నిలిచిపోతుందని అంటున్నాడు. అయితే కేవలం మజ్ను అని పెట్టకుండా మిస్టర్ అనే పదాన్ని తగిలించడం వెనక రీజన్ బయటపెట్టాడు అఖిల్.

“మజ్ను అనే టైటిల్ పెట్టడానికి ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఓల్డ్ ఫీల్ వస్తుందని మాత్రం అంతా సలహా ఇచ్చారు. వాళ్లందరి సలహాలు తీసుకున్న మీదట టైటిల్ కు ముందు మిస్టర్ అనే పదాన్ని తగిలించాం. దాని వల్ల టైటిల్ కు మోడ్రన్ ఫీల్ వచ్చింది.”

సినిమాలో తన పాత్ర గురించి వివరంగా చెప్పుకొచ్చాడు అఖిల్. కేవలం తన క్యారెక్టరైజేషన్ నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నానని, తన క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసేందుకు దర్శకుడు ఏకంగా అర్థగంట రన్ టైం కేటాయించాడని చెప్పుకొచ్చాడు.

“నేను ఇందులో మోడ్రన్ లవర్ గా కనిపిస్తాను. అమ్మాయిల్ని ఇష్టపడుతుంటాను. అమ్మాయలు కూడా తనను అంతే ఇష్టపడాలని కోరుకుంటాను. కానీ అంతా షార్ట్ టర్మ్ మాత్రమే. లాంగ్ రిలేషన్ షిప్ ఇష్టముండదు.”

మిస్టర్ మజ్ను సినిమాలో నాగార్జున ప్రమేయం లేదంటున్నాడు అఖిల్. ఇది తమ సొంత బ్యానర్ సినిమా కాదు కాబట్టి…. నాన్నగారు జోక్యం చేసుకోలేదని, అప్పుడప్పుడు సినిమా రష్ మాత్రం చూశారని అన్నాడు. స్క్రిప్ట్ మాత్రం విన్నారని, ఒక్క మార్పు కూడా చెప్పలేదంటున్నాడు అఖిల్.

First Published:  24 Jan 2019 12:03 AM GMT
Next Story