Telugu Global
NEWS

ఆస్తులు తాకట్టు పెట్టిన నటుడు మోహన్‌బాబు

నటుడు మోహన్‌బాబు తన ఆస్తులను తాకట్టు పెట్టారు. బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. దీనంతటికి ఏపీ ప్రభుత్వమే కారణమని ఆయన వివరించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీవిద్యానికేతన్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన… ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. గడిచిన రెండేళ్లకు గాను రూ. 20 కోట్ల మేర డబ్బు రావాల్సి ఉందని… కానీ దాన్ని ప్రభుత్వం […]

ఆస్తులు తాకట్టు పెట్టిన నటుడు మోహన్‌బాబు
X

నటుడు మోహన్‌బాబు తన ఆస్తులను తాకట్టు పెట్టారు. బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. దీనంతటికి ఏపీ ప్రభుత్వమే కారణమని ఆయన వివరించారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీవిద్యానికేతన్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన… ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు.

గడిచిన రెండేళ్లకు గాను రూ. 20 కోట్ల మేర డబ్బు రావాల్సి ఉందని… కానీ దాన్ని ప్రభుత్వం మంజూరు చేయడం లేదన్నారు. దీని వల్ల విద్యాసంస్థలను నడపడం కూడా కష్టమైపోతోందన్నారు. 20 కోట్ల మేర బకాయి రాకపోవడంతో మరో దారి లేక తనకున్న ఆస్తులను తాకట్టు పెట్టడంతో పాటు… బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకున్నట్టు మోహన్ బాబు వివరించారు.

కాలేజీల నిర్వాహణకు ఒక్క నెలకు ఆరు కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం నుంచి సొమ్ము రాకపోయినా సకాలంలో సిబ్బందికి జీతాలిస్తున్నట్టు చెప్పారు.

First Published:  22 Jan 2019 8:19 PM GMT
Next Story