Telugu Global
NEWS

బీకాం ఫిజిక్స్ ఓవరాక్షన్... క్లాస్‌ పీకిన సీఎం

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు సీటు విషయంలో జలీల్ ఖాన్ చేసిన హడావుడే కారణం. తొలుత కుమార్తె షబానాతో కలిసి అమరావతిలో చంద్రబాబును కలిశారు జలీల్‌ఖాన్. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని… ఆ సీటు తన కుమార్తె షబానాకు కేటాయించాలని జలీల్‌ ఖాన్‌ చంద్రబాబును కోరారు. స్పష్టమైన హామీ ఇవ్వని చంద్రబాబు… నియోజవకర్గంలో పర్యటించాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని షబానాకు సూచించి పంపారు. […]

బీకాం ఫిజిక్స్ ఓవరాక్షన్... క్లాస్‌ పీకిన సీఎం
X

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు సీటు విషయంలో జలీల్ ఖాన్ చేసిన హడావుడే కారణం.

తొలుత కుమార్తె షబానాతో కలిసి అమరావతిలో చంద్రబాబును కలిశారు జలీల్‌ఖాన్. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని… ఆ సీటు తన కుమార్తె షబానాకు కేటాయించాలని జలీల్‌ ఖాన్‌ చంద్రబాబును కోరారు. స్పష్టమైన హామీ ఇవ్వని చంద్రబాబు… నియోజవకర్గంలో పర్యటించాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని షబానాకు సూచించి పంపారు.

అలా చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన వెంటనే జలీల్‌ ఖాన్ మీడియా వారిని పిలిచి… విజయవాడ వెస్ట్‌ సీటును తన కుమార్తెకు చంద్రబాబు ఓకే చేశారని ప్రకటించారు. ఇలా తన కుమార్తెకు టికెట్ ఖరారు చేయడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.

అంతటితో ఆగకుండా తన అనుచరులకు ఈ విషయం చెప్పి ఇంటి వద్ద, తన కార్యాలయం వద్ద టపాసులు కాల్పించారు జలీల్‌ ఖాన్. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు జలీల్‌ ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు నేను టికెట్‌ ఎక్కడ ఖరారు చేశాను?… ఆ విషయం మీకు చెప్పానా? అని క్లాస్ పీకారు. దీంతో జలీల్‌ ఖాన్‌,ఆయన అనుచరులు షాక్‌ అయ్యి సైలెంట్ అయిపోయారు.

First Published:  22 Jan 2019 8:30 PM GMT
Next Story