Telugu Global
NEWS

బాబుకు చుక్కలు చూపిస్తున్న తమ్ముళ్లు

నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయనే చెప్పుకుంటున్నట్లుగా దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు. ఇంతేనా.. సన్నిహిత మీడియా చేత అన్ని యుద్ధముల ఆరితేరిన వాడు అనిపించుకున్న నాయకుడు. అంతటి రాజకీయ ధీరుడికి తెలుగు తమ్ముళ్లు తలనొప్పులు తీసుకొస్తున్నారు.  రాజకీయ దురంధరుడికి చుక్కలు చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలుగుదేశం అధినేతకు పార్టీలో అంతర్గత విభేదాలు రోజురోజుకు పెరిగుతున్నాయి. ఆ జిల్లా… ఈ జిల్లా అని […]

బాబుకు చుక్కలు చూపిస్తున్న తమ్ముళ్లు
X

నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయనే చెప్పుకుంటున్నట్లుగా దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు. ఇంతేనా.. సన్నిహిత మీడియా చేత అన్ని యుద్ధముల ఆరితేరిన వాడు అనిపించుకున్న నాయకుడు. అంతటి రాజకీయ ధీరుడికి తెలుగు తమ్ముళ్లు తలనొప్పులు తీసుకొస్తున్నారు. రాజకీయ దురంధరుడికి చుక్కలు చూపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలుగుదేశం అధినేతకు పార్టీలో అంతర్గత విభేదాలు రోజురోజుకు పెరిగుతున్నాయి. ఆ జిల్లా… ఈ జిల్లా అని లేదు… ఈ నియోజకవర్గం… ఆ నియోజకవర్గం అని లేదు. మొత్తం రాష్ట్రం అంతా ఇదే పరిస్ధితి నెలకొంది.

తాజాగా కడప జిల్లాలో పార్టీ ప్రతిష్ట మసకబారి నాయకుల మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి. మంత్రి ఆదినారాయణ రెడ్డి, శాసనసభ్యుడు మేడా మల్లికార్జున రెడ్డి మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరుకుని ఆయన పార్టీ వీడే పరిస్థితి వచ్చింది.

గత ఎన్నికల్లో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసింది, గెలిచింది మేడా మల్లికార్జున రెడ్డి ఒక్కరే. ఈయన తెలుగుదేశం పార్టీని వీడడంతో కడపలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదంటున్నారు.

అనంతపురం జిల్లాలో ఎంపీ జె.సీ. దివాకర్ రెడ్డికి జిల్లాలోని శాసనసభ్యులకు పొసగడం లేదు. ఇక్కడ పార్టీకి తలనొప్పులు తీసుకువస్తున్నారంటూ జెసీపై ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు కుమారులతో పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయి. జిల్లాలో కొందరు బహిరంగంగానే చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటున్నారు.

ఇక విశాఖపట్నం జిల్లాలో మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస రావుల మధ్య విభేదాలు పార్టీని ముంచడం ఖాయమని ఆ జిల్లాకు చెందిన నాయకులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో శాసనసభ్యుడు చింతమనేనిని మార్చాలని మెజార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

వీటితో పాటు మిగిలిన జిల్లాల్లోనూ పార్టీ పట్ల అసమ్మతి వాదులు రోజురోజుకు పెరుగుతున్నారు. మరోవైపు విజయవాడలో తాజాగా వంగవీటి రాధను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఆయన రాకను పార్టీలో చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా యువనేత దేవినేని అవినాష్ వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు.

ఇన్ని ఇబ్బందులతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో “ఎన్నిసార్లు చెప్పాలి. మారతారా… మార్చేయనా” అంటూ కాసింత కటువుగానే కోపగించాడు చంద్రబాబు నాయుడు.

First Published:  22 Jan 2019 10:53 PM GMT
Next Story