Telugu Global
National

క్వీన్ విక్టోరియా వర్థంతి.... నివాళులు అర్పించిన హిందూ సేన.... ముస్లింల నుంచి దేశాన్ని కాపాడిందని వ్యాఖ్య

బ్రిటిష్ మహారాణి క్వీన్ వికోర్టియా 118వ వర్థంతిని హిందూ సేన ఘనంగా నిర్వహించింది. భారత దేశాన్ని ముస్లింల చెర నుంచి విడిపించి మనకు నిజమైన స్వతంత్రాన్ని అందించిందని ఈ సందర్భంగా హిందూ సేన కార్యకర్తలు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ విషయం నిజమేనా అంటూ ఒక మీడియా సంస్థ హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తాను అడగగా.. అవును నిజమేనన్నారు. ముస్లిం చక్రవర్తుల అరాచక పాలన నుంచి దేశాన్ని 1857లో బ్రిటిష్ రాణి రక్షించిందని అదే మనకు తొలి […]

క్వీన్ విక్టోరియా వర్థంతి....  నివాళులు అర్పించిన హిందూ సేన.... ముస్లింల నుంచి దేశాన్ని కాపాడిందని వ్యాఖ్య
X

బ్రిటిష్ మహారాణి క్వీన్ వికోర్టియా 118వ వర్థంతిని హిందూ సేన ఘనంగా నిర్వహించింది. భారత దేశాన్ని ముస్లింల చెర నుంచి విడిపించి మనకు నిజమైన స్వతంత్రాన్ని అందించిందని ఈ సందర్భంగా హిందూ సేన కార్యకర్తలు వ్యాఖ్యానించడం గమనార్హం.

ఈ విషయం నిజమేనా అంటూ ఒక మీడియా సంస్థ హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తాను అడగగా.. అవును నిజమేనన్నారు. ముస్లిం చక్రవర్తుల అరాచక పాలన నుంచి దేశాన్ని 1857లో బ్రిటిష్ రాణి రక్షించిందని అదే మనకు తొలి స్వాతంత్రమని ఆయన అన్నారు.

1860లో బ్రిటిష్ రాణి ఒక చట్టాన్ని అమలు చేసిందని.. దాని ద్వారా స్త్రీలకు ఇతర భారతీయులందరికీ సమానత్వపు హక్కు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. 1862లో ఇండియన్ పీనల్ కోడ్ అమలులోకి వచ్చిందని .. ఆ విధంగా ఆమె దేశానికి ఎంతో మేలు చేసిందని ఆయన కొనియాడారు. అంతకు ముందు ఏ పరిపాలకుడు కూడా మనకు సమానత్వపు హక్కు ఇవ్వలేదని.. అంతా దోచుకున్న వారే కాని ప్రజల గురించి ఆలోచించిన వాళ్లు లేరని ఆయన చెప్పారు.

బ్రిటిషర్లు చేసిన కొన్ని తప్పులను నేను తప్పక విమర్శిస్తాను.. జలియన్ వాలా బాగ్ ఘటన అందులో ఒకటని గుప్తా చెప్పారు. అలాంటి ఘటనలు జరుగకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

అసలు బ్రిటిషర్ల కాలంలో మనం బానిసత్వంలో ఉన్నామనే మాట పచ్చి అబద్దం.. అసలు అలా అనే హక్కు మనకు లేదన్నారు. హిందూసేన ఉపాధ్యక్షుడు సూర్జిత్ యాదవ్ మాట్లాడుతూ.. మన దేశ అభివృద్ధిలో బ్రిటిషర్ల భాగస్వామ్యం ఉందని చెప్పారు. మన దేశంలో ప్రజాస్వామ్యం వర్థిల్లడానికి బ్రిటిషర్లే కారణం అన్నారు. అందుకే క్వీన్ విక్టోరియా జయంతిని హిందూ సేన ఘనంగా నిర్వహిస్తోందని సమర్థించుకున్నారు.

హిందూసేన సంస్థ చేసే పనులు అన్నీ వివాదాస్పదంగా ఉంటుంటాయి. ముస్లింలను తీవ్రంగా వ్యతిరేకించే ఈ సంస్థ కార్యక్తలు గతంలో ఢిల్లీలోని పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ సంస్థ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. పాకిస్తాన్‌తో చర్చలు జరపవద్దని కరపత్రాలు కూడా పంపిణీ చేశారు. అప్పట్లోనే ఢిల్లీ పోలీసులు పలువురు నాయకులను అరెస్టు చేశారు.

First Published:  22 Jan 2019 8:14 AM GMT
Next Story