Telugu Global
Cinema & Entertainment

హిట్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుంది

స్వతహాగా నటుడు అయిన అవసరాల శ్రీనివాస్ “ఊహలు గుస గుస లాడే” సినిమాతో దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగ శౌర్య కి మంచి హిట్ లభించింది. ఈ సినిమా తరువాత మళ్ళీ తన నటనని కొనసాగించాడు అవసరాల. మళ్ళీ కొంత కాలం గ్యాప్ తరువాత నాగ శౌర్య ని, నార రోహిత్ లని హీరోలుగా పెట్టి “జ్యో అచ్యుతానంద” అనే సినిమాని డైరెక్ట్ చేసాడు. […]

హిట్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుంది
X

స్వతహాగా నటుడు అయిన అవసరాల శ్రీనివాస్ “ఊహలు గుస గుస లాడే” సినిమాతో దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగ శౌర్య కి మంచి హిట్ లభించింది. ఈ సినిమా తరువాత మళ్ళీ తన నటనని కొనసాగించాడు అవసరాల. మళ్ళీ కొంత కాలం గ్యాప్ తరువాత నాగ శౌర్య ని, నార రోహిత్ లని హీరోలుగా పెట్టి “జ్యో అచ్యుతానంద” అనే సినిమాని డైరెక్ట్ చేసాడు.

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన రెండేళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు ఒక సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు అవసరాల శ్రీనివాస్. ఈ సారి కూడా నాగ శౌర్య ని హీరోగా పెట్టి సినిమాని చేస్తాడట శ్రీనివాస్. అయితే మొదట ఈ కథకి నానిని హీరోగా అనుకున్నాడట అవసరాల. కానీ నాని బిజీగా ఉండటం వల్ల ఇదే కథని నాగ శౌర్యతో తెరకేక్కిస్తున్నాడు అవసరాల.

ఈ ఏడాది మొదటి భాగంలో ఈ సినిమా షూటింగ్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరి తన మాటలతో ప్రేక్షకులని మాయ చేసే అవసరాల ఈ సారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకి వస్తాడో చూడాలి.

First Published:  20 Jan 2019 11:56 PM GMT
Next Story