Telugu Global
Cinema & Entertainment

సీక్వెల్ పై వరుణ్ తేజ్ క్లారిటీ

ఓ సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ తీసే ట్రెండ్ సౌత్ కు కూడా చాన్నాళ్ల కిందటే వచ్చింది. రాజుగారి గది, కాంచన, యముడు లాంటి సినిమాలు ఇలా వచ్చినవే. ఇప్పుడీ లిస్ట్ లో చేరడానికి రెడీగా ఉంది ఎఫ్2 సినిమా. అవును.. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. స్వయంగా హీరో వరుణ్ తేజ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఎఫ్2 సక్సెస్ మీట్ లో పాల్గొన్న వరుణ్ తేజ్.. త్వరలోనే ఎఫ్3 సినిమా సెట్స్ పైకి వస్తుందని […]

సీక్వెల్ పై వరుణ్ తేజ్ క్లారిటీ
X

ఓ సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ తీసే ట్రెండ్ సౌత్ కు కూడా చాన్నాళ్ల కిందటే వచ్చింది. రాజుగారి గది, కాంచన, యముడు లాంటి సినిమాలు ఇలా వచ్చినవే. ఇప్పుడీ లిస్ట్ లో చేరడానికి రెడీగా ఉంది ఎఫ్2 సినిమా. అవును.. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. స్వయంగా హీరో వరుణ్ తేజ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఎఫ్2 సక్సెస్ మీట్ లో పాల్గొన్న వరుణ్ తేజ్.. త్వరలోనే ఎఫ్3 సినిమా సెట్స్ పైకి వస్తుందని ప్రకటించాడు. సీక్వెల్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని, దిల్ రాజు-అనీల్ రావిపూడితో వర్క్ చేసేందుకు చాలా ఆత్రుతగా ఉన్నానని ప్రకటించాడు.

ఇదే విషయాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ప్రకటించాడు. త్వరలోనే ఎఫ్3 ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని ప్రకటించిన అనీల్…. సీక్వెల్ లో కూడా వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా ఉంటారని తెలిపాడు. మొత్తానికి టాలీవుడ్ తెరపైకి మరో సీక్వెల్ రాబోతోందన్నమాట. అన్నట్టు వెంకటేష్ కూడా గురు సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడు.

First Published:  19 Jan 2019 9:38 PM GMT
Next Story