Telugu Global
NEWS

రిజిస్ట్రేషన్లపై సంచలన నిర్ణయం ప్రకటించిన కేసీఆర్‌

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో కీలక ప్రకటనలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతామన్నారు. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చేసి చూపిస్తామన్నారు. భూ రికార్డులను ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. ఇందుకు కోసం ధరణి వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నామని… గంట గంటకు భూ రికార్డులు అప్‌డేట్ చేస్తామన్నారు. వరుసగా ఎన్నికల కోడ్‌లు వస్తున్నాయని.. మేలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే పంచాయతీరాజ్‌ చట్టాన్ని చాలా కఠినంగా […]

రిజిస్ట్రేషన్లపై సంచలన నిర్ణయం ప్రకటించిన కేసీఆర్‌
X

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో కీలక ప్రకటనలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతామన్నారు. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చేసి చూపిస్తామన్నారు. భూ రికార్డులను ప్రక్షాళన చేసి తీరుతామన్నారు.

ఇందుకు కోసం ధరణి వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నామని… గంట గంటకు భూ రికార్డులు అప్‌డేట్ చేస్తామన్నారు. వరుసగా ఎన్నికల కోడ్‌లు వస్తున్నాయని.. మేలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే పంచాయతీరాజ్‌ చట్టాన్ని చాలా కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.

రిజస్ట్రేషన్ విధానంలో మార్పులు తెస్తామని చెప్పారు. ఏ ఒక్కరూ పైసా లంచం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లు చేయించే విధానాన్ని అమలులోకి తెస్తామన్నారు.

చీకట్లో బాణం వేసినట్టుగా తన విధానాలు ఉండవని స్పష్టం చేశారు. రైతు లక్ష రూపాయల రుణమాఫి చేసి చూపిస్తామన్నారు కేసీఆర్‌. గ్రామాల్లో పరిశుభ్రత కోసం కఠినంగా ఉంటామన్నారు. రోడ్లపై చెత్త వేసే వారికి రూ. 500 జరిమానా విధిస్తామని కేసీఆర్ చెప్పారు. మరికొన్ని నెలల తర్వాత గ్రామాల్లోకి వెళ్తే చెత్త గానీ, పిచ్చిమొక్కలు గానీ, దోమలు కాని కనిపించడానికి వీల్లేకుండా చేస్తామన్నారు.

మరోసారి నమ్మకం ఉంచి అధికారం అప్పగించిన ప్రజల కోసం మంచి చేయాలన్న ఉద్దేశంతో విధివిధానాల రూపకల్పన ప్రస్తుతం జరుగుతోందని కేసీఆర్ చెప్పారు.

నిజాం తర్వాత భూ సర్వేలు చేపట్టలేదని…. దీని వల్ల భూసర్వే వ్యవస్థే కుప్పకూలిపోయిందన్నారు. దీని వల్ల రైతులు చాలా ఇబ్బందిపడ్డారన్నారు. గత ప్రభుత్వాలు రైతులను వారి ఖర్మకు వదిలేశారని… కానీ తాము మాత్రం అలా వదిలేయమన్నారు. వివాదాల్లో ఉన్న భూములపై దృష్టి సారించి వివాదాలను పరిష్కరిస్తామన్నారు.

వందకు వంద శాతం రైతుల ప్రభుత్వంగా తాము పనిచేస్తామన్నారు. 100 శాతం భూరికార్డులను ప్రక్షాళన చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంచు భూమి వివరాలు కూడా ధరణి వెబ్‌సైట్‌లో ఉంటాయన్నారు. ఒక్క పైసా లంచం ఇవ్వకుండానే భూముల రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశాన్ని రైతులకు ఇస్తామన్నారు.

భూముల రిజిస్ట్రేషన్లను ఇకపై ప్రతి మండల తహసీల్దార్‌ కార్యాలయంలోనే చేస్తామన్నారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ధరణి వెబ్‌సైట్‌లో అప్‌ డేట్ చేస్తామన్నారు. ఏ రైతు కూడా ఒక్క పైసా లంచం ఇవ్వకుండా పనిచేయించుకునే వ్యవస్థను తీసుకొస్తామన్నారు. కొందరు దుర్మార్గులు పిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేస్తున్నారని… అలాంటి వారి ఆట కట్టిస్తామన్నారు.

First Published:  20 Jan 2019 3:11 AM GMT
Next Story