Telugu Global
International

బిల్‌ గేట్స్ ఫొటో వైరల్‌... ప్రశంసల జల్లు

నాలుగు డబ్బులు రాగానే… మనుషులు హఠాత్తుగా మారిపోతుంటారు. కొంచెం స్టేటస్‌ పెరగగానే తాము అతీత శక్తులం అనుకుంటారు. తమ బ్లడ్‌లో కణాలే వేరని భ్రమిస్తూ మిగిలిన సమాజాన్ని వెక్కిరిస్తుంటారు.  డబ్బు, హోదా మాయలో పడి తమకు తామే సమాజానికి దూరమవుతుంటారు. కానీ ఆ డబ్బుకు, స్టేచర్‌కు కూడా లొంగని క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి. డబ్బు ఎక్కువై ఎగిరిపడుతున్న పక్షులకు కనువిప్పు కలిగించేందుకు ఉదాహరణగా నిలుస్తుంటారు అలాంటి వారు. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కూడా అలాంటి వ్యక్తే. […]

బిల్‌ గేట్స్ ఫొటో వైరల్‌... ప్రశంసల జల్లు
X

నాలుగు డబ్బులు రాగానే… మనుషులు హఠాత్తుగా మారిపోతుంటారు. కొంచెం స్టేటస్‌ పెరగగానే తాము అతీత శక్తులం అనుకుంటారు. తమ బ్లడ్‌లో కణాలే వేరని భ్రమిస్తూ మిగిలిన సమాజాన్ని వెక్కిరిస్తుంటారు. డబ్బు, హోదా మాయలో పడి తమకు తామే సమాజానికి దూరమవుతుంటారు. కానీ ఆ డబ్బుకు, స్టేచర్‌కు కూడా లొంగని క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి.

డబ్బు ఎక్కువై ఎగిరిపడుతున్న పక్షులకు కనువిప్పు కలిగించేందుకు ఉదాహరణగా నిలుస్తుంటారు అలాంటి వారు. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కూడా అలాంటి వ్యక్తే. ఎంత ఎత్తుగా ఎదిగినా తాను సామాన్యుడిగా ఉండేందుకు ఆయన ఇష్టపడుతుంటారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో బిల్ గేట్స్‌కు సంబంధించిన ఒక ఫొటో వైరల్ అవుతోంది. చిటికెలో షాపునే కొనేందుకు సామర్ధ్యం ఉన్నా సరే బిల్ గేట్స్… బర్గర్ కోసం దుకాణం ముందు క్యూలో నిలబడ్డారు. మిగిలిన కస్టమర్ల తరహాలోనే తాను క్యూలో నిలబడి తన వంతు వచ్చాకే బర్గర్ కొనుక్కొని వెళ్లారు.

ఈ ఫొటోను మైక్రోసాప్ట్‌ మాజీ ఉద్యోగి ఒకరు పోస్టు చేయగా…. అది వైరల్ అవుతోంది. సంపదను చూసి పొంగిపోయే వ్యక్తులు ఈ ప్రపంచ కుబేరుడిని చూసైనా నేర్చుకోండి అంటూ నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. బిల్ గేట్స్ నిరాడంబరతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story