Telugu Global
National

ఈ తండ్రీ కొడుకులకు చట్టాలు వర్తించవా?

ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు తనమీద ఉన్న కేసుల వివరాలు, విద్యార్హతలు, ఆస్తులు, అప్పుల వివరాలు మొదలైనవి ఎన్నికల అఫిడవిట్‌లో తప్పకుండా పేర్కొనాలి. అందులో ఏమైనా తప్పుడు సమాచారం ఇచ్చినా, కేసులు ఉన్నప్పటికీ అఫిడవిట్‌లో చూపకపోయినా, అన్ని ఆస్తుల వివరాలు చెప్పకపోయినా…. వాళ్ళ నామినేషన్‌ను తిరస్కరించవచ్చు. ఒక వేళ ఎన్నికలు అయిపోతే వాళ్ళ ఎన్నిక చెల్లకపోవచ్చు. అందరి విషయంలో జరుగుతున్నది ఇది…. అయితే అమిత్‌ షాకు మాత్రం ఈ చట్టం వర్తించలేదు. 2017లో రాజ్యసభ సీటు కోసం […]

ఈ తండ్రీ కొడుకులకు చట్టాలు వర్తించవా?
X

ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు తనమీద ఉన్న కేసుల వివరాలు, విద్యార్హతలు, ఆస్తులు, అప్పుల వివరాలు మొదలైనవి ఎన్నికల అఫిడవిట్‌లో తప్పకుండా పేర్కొనాలి. అందులో ఏమైనా తప్పుడు సమాచారం ఇచ్చినా, కేసులు ఉన్నప్పటికీ అఫిడవిట్‌లో చూపకపోయినా, అన్ని ఆస్తుల వివరాలు చెప్పకపోయినా…. వాళ్ళ నామినేషన్‌ను తిరస్కరించవచ్చు. ఒక వేళ ఎన్నికలు అయిపోతే వాళ్ళ ఎన్నిక చెల్లకపోవచ్చు. అందరి విషయంలో జరుగుతున్నది ఇది…. అయితే అమిత్‌ షాకు మాత్రం ఈ చట్టం వర్తించలేదు.

2017లో రాజ్యసభ సీటు కోసం అమిత్‌ షా అఫిడవిట్‌ దాఖలు చేశాడు. అయితే ఆ అఫిడవిట్‌ లో అహ్మదాబాద్‌లో అమిత్‌ షాకు ఉన్న రెండు స్థిరాస్తులను పేర్కొనలేదు. ఈ రెండు స్థిరాస్తులను అమిత్‌ షా పేరు మీదే బ్యాంకులో తనఖా పెట్టి 25 కోట్ల రూపాయల రుణం కూడా తీసుకున్నాడు. ఇంత పక్కాగా ఆధారాలున్నప్పటికీ…. ఈ ఆస్తుల గురించి అఫిడవిట్‌లో పేర్కొననప్పటికీ…. ఈ చట్టల ప్రకారం అమిత్‌ షా మీద చర్యలేమీ లేవు.

వాళ్ళ అబ్బాయి జైషా కూడా చట్టాలకు అతీతంగానే వ్యవహరిస్తున్నాడు. జైషా కంపెనీ గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కు తన సంస్థ ఆర్థిక లావాదేవీలకు సంబందించిన నివేదికలు సమర్పించలేదని తెలిసింది. మామూలుగా అయితే ఇలా నివేదికలు సమర్పించని సంస్థలపై భారీ జరిమానాలు విధిస్తారు. కానీ జైషా…. అమిత్‌ షా కొడుకు కదా! అందుకే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

First Published:  17 Jan 2019 11:48 PM GMT
Next Story