Telugu Global
International

ప్రపంచ బ్యాంకు పీఠంపై ఇవాంకా ట్రంప్ !

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్ వరల్డ్‌ బ్యాంకు అధ్యక్ష పీఠంపై కన్నేశారు. అధ్యక్ష పదవి కోసం ఆమె పోటీ పడబోతున్నారు. అధ్యక్షుడిగా ఉంటూ వచ్చిన యాంగ్ కిమ్ ఇంకా మూడేళ్ల పదవి కాలం ఉండగానే హఠాత్తుగా ఇటీవల రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడి నియామకం జరగాల్సి ఉంటుంది. వచ్చే నెల మొదటి వారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇవాంకా రేసులో ఉన్నారు. ఆమెతోపాటు   మాజీ రాయబారి నిక్కీ హేలీ కూడా ప్రపంచ బ్యాంకు అధ్యక్ష […]

ప్రపంచ బ్యాంకు పీఠంపై ఇవాంకా ట్రంప్ !
X

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్ వరల్డ్‌ బ్యాంకు అధ్యక్ష పీఠంపై కన్నేశారు. అధ్యక్ష పదవి కోసం ఆమె పోటీ పడబోతున్నారు. అధ్యక్షుడిగా ఉంటూ వచ్చిన యాంగ్ కిమ్ ఇంకా మూడేళ్ల పదవి కాలం ఉండగానే హఠాత్తుగా ఇటీవల రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడి నియామకం జరగాల్సి ఉంటుంది.

వచ్చే నెల మొదటి వారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇవాంకా రేసులో ఉన్నారు. ఆమెతోపాటు మాజీ రాయబారి నిక్కీ హేలీ కూడా ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పీఠం కోసం పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించి 2017లో సౌదీ అరేబియా సాయంతో ఒక బిలియన్ డాలర్ల ఫండ్‌ను సాధించడంలో ఇవాంకా ట్రంప్ కీలక పాత్ర పోషించారు.

అధ్యక్ష పదవి కోసం చాలా సిపార్సులు వస్తున్నాయని వరల్డ్ బ్యాంకు అధికారులు వెల్లడించారు. వరల్డ్ బ్యాంకులో అత్యధిక వాటా అమెరికాదే. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి అమెరికా మద్దతు ఇచ్చిన వారికే వరల్డ్‌ బ్యాంకు అధ్యక్ష పీఠం దక్కుతోంది.

ఈసారి నేరుగా అమెరికా అధ్యక్షుడి కుమార్తె రేసులోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు పూర్తి పారదర్శకంగా నిర్వహించి ఏప్రిల్‌లో బ్యాంకు అధ్యక్షుడిని ప్రకటిస్తామని బ్యాంకు బోర్డు వెల్లడించింది.

First Published:  13 Jan 2019 8:11 PM GMT
Next Story