Telugu Global
NEWS

వృద్ధులకు పండుగ లాంటి వార్త

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. తాజాగా ఓట్ల వాన కోసం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వృద్ధాప్య పించన్‌ను రెట్టింపు చేస్తున్నారు. ప్రస్తుతం వృద్ధులకు నెలకు వెయ్యి రూపాయల పించన్ ఇస్తున్నారు. దాన్ని రెండు వేలు చేయాలని నిర్ణయించారు. ఈ పెరిగిన మొత్తం వెంటనే పించన్‌దారులకు అందించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 1న వెయ్యి స్థానంలో రెండు వేల రూపాయల పించన్‌ అందనుంది. వితంతు పించన్‌ను కూడా రెండు వేలు చేస్తున్నారు. […]

వృద్ధులకు పండుగ లాంటి వార్త
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. తాజాగా ఓట్ల వాన కోసం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వృద్ధాప్య పించన్‌ను రెట్టింపు చేస్తున్నారు.

ప్రస్తుతం వృద్ధులకు నెలకు వెయ్యి రూపాయల పించన్ ఇస్తున్నారు. దాన్ని రెండు వేలు చేయాలని నిర్ణయించారు. ఈ పెరిగిన మొత్తం వెంటనే పించన్‌దారులకు అందించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 1న వెయ్యి స్థానంలో రెండు వేల రూపాయల పించన్‌ అందనుంది.

వితంతు పించన్‌ను కూడా రెండు వేలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 50లక్షల 61వేల 908 మందికి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పించన్లు అందుతున్నాయి. ఇందు కోసం నెలకు 560 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఏడాదికి 6వేల 720 కోట్లు ఖర్చు అవుతోంది.

పించన్‌ మొత్తాన్ని రెట్టింపు చేయడం వల్ల నెలకు 1,120 కోట్లు, ఏడాదికి 13వేల 440 కోట్లు ఖర్చు అవుతుంది. పెంచిన మొత్తాన్ని ఫిబ్రవరి ఒకటి నుంచి అందించేలా ఈ నెలాఖరులో ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

First Published:  10 Jan 2019 6:53 PM GMT
Next Story