Telugu Global
National

ఆ మొసలి అంత్యక్రియలకు 500 మంది హాజరు.... ప్రత్యేకత ఏమిటంటే....

మొసలి అంటే ఎవరికైనా భయం. పైగా మొసలి ఉందని తెలిసిన తర్వాత ఆ నీటిలోకి అడుగుపెట్టే సాహసం సామాన్యులెవరూ చేయలేరు. కానీ చత్తీస్‌గఢ్‌లోని భవమోహత్ర గ్రామంలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. గ్రామ చెరువులో ఒక మొసలి ఉండేది. కానీ ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టేది కాదు. గ్రామంలోని పిల్లలు కూడా ధైర్యంగా చెరువులోకి దిగి మొసలితో ఆడుకునేవారు. ఆ మొసలికి గ్రామస్తులు ముద్దుగా ”గంగారం” అని పేరు కూడా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు అది […]

ఆ మొసలి అంత్యక్రియలకు 500 మంది హాజరు.... ప్రత్యేకత ఏమిటంటే....
X

మొసలి అంటే ఎవరికైనా భయం. పైగా మొసలి ఉందని తెలిసిన తర్వాత ఆ నీటిలోకి అడుగుపెట్టే సాహసం సామాన్యులెవరూ చేయలేరు. కానీ చత్తీస్‌గఢ్‌లోని భవమోహత్ర గ్రామంలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. గ్రామ చెరువులో ఒక మొసలి ఉండేది. కానీ ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టేది కాదు.

గ్రామంలోని పిల్లలు కూడా ధైర్యంగా చెరువులోకి దిగి మొసలితో ఆడుకునేవారు. ఆ మొసలికి గ్రామస్తులు ముద్దుగా ”గంగారం” అని పేరు కూడా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు అది చనిపోయింది. బుధవారం చనిపోయిన మొసలి…. ఆ తర్వాత నీటిపై తేలుతూ కనిపించింది. దాంతో గ్రామస్తులు దాన్ని ఒడ్డుకు తెచ్చారు.

అధికారులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం చేయించిన అధికారులు… గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు తిరిగి అప్పగించారు. గంగరాం మృతదేహానికి గ్రామస్తులు భారీగా అంత్యక్రియలు నిర్వహించారు. ఏకంగా 500 మంది ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తాము మొసలిని దేవుడిగా భావించామని గ్రామ సర్పంచ్ చెప్పారు.

తమ పిల్లలు చెరువులో ఈత కొడుతున్నా ఏమీ అనేది కాదని వివరించారు. మొసలికి గుడి కట్టించాలన్న ఆలోచన కూడా ఉందని వెల్లడించారు.

దాదాపు వందేళ్ల నుంచి ఈ మొసలి చెరువులో నివాసం ఉంటోందని గ్రామంలోని వృద్ధులు చెబుతున్నారు. ఈ మొసలి వయసు దాదాపు 130 ఏళ్లు ఉంటుందని అటవీ అధికారి సిన్హా వివరించారు. బరువు 250 కిలోలు ఉన్నట్టు వెల్లడించారు.

First Published:  10 Jan 2019 11:10 PM GMT
Next Story